హైదరాబాద్: పీవీ నరసింహారావును ప్రధానిని చేసిన కాంగ్రెస్ పార్టీది గొప్పతనమా? పీవీ కూతురికి ఎమ్మెల్సీ టికెట్టిచ్చినా టీఆర్ఎస్‌ది గొప్పా  చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కోరారు.

గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు కాబట్టే ఆయన కూతురికి గుర్తింపు వచ్చిందన్నారు. పీవీ కూతురికి టీఆర్ఎస్  ఎమ్మెల్సీ టికెట్టు ఇస్తే మేమేందుకు మాట్లాడాలో చెప్పాలన్నారు.

also read:గ్రూపులతో కాంగ్రెస్ బలహీనం, చర్యలు తీసుకోవాలి: జానారెడ్డి సంచలనం

తెలంగాణలో 4.90 లక్షల ఉద్యోగాలను ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని టీఆర్ఎస్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను భర్తీ చేసిందని ప్రకటించిందన్నారు. అయితే కొత్తగా 91 వేల ఖాళీలు ఎక్కడి నుండి వచ్చాయని  ఆయన ప్రశ్నించారు.టీఆర్ఎస్ భర్తీ చేసిన ఉద్యోగాల్లో ఎక్కువగా కాంట్రాక్టు ఉద్యోగాలే ఉన్నాయన్నారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి ఏమైందని ఆయన ప్రశ్నించారు.