Asianet News TeluguAsianet News Telugu

తాన్యా సొంత కూతురు కాదు.. అంకుల్ అని పిలిచేది.. వాడు కారు నడిపాడనే తెలిస్తే షూట్ చేసేవాడిని: ఫిరోజ్ ఖాన్

హైదరాబాద్‌లో ఇటీవల ఎయిర్‌పోర్ట్ రోడ్డులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు త్యాన్యా ఖాక్డే మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే త్యాన్యా మృతికి సంబంధించి, ఇంట్లో చోటుచేసున్న విషాదం గురించి ఫిరోజ్ ఖాన్ ఓ యూట్యూబ్ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. త్యాన్యా ఖాక్డే తన సొంత కూతురు కాదని.. ఆమెకు తాను స్టెప్ ఫాదర్‌ను అని చెప్పారు. 
 

Congress Leader Feroz Khan About Tanya Kakade Death in road accident
Author
First Published Aug 18, 2022, 1:05 PM IST

హైదరాబాద్‌లో ఇటీవల ఎయిర్‌పోర్ట్ రోడ్డులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూతురు త్యాన్యా ఖాక్డే మృతిచెందిన సంగతి తెలిసిందే. ఓ ఫంక్షన్‌ నుంచి హాజరై స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు నడుపుతున్న మీర్జా అలీ అతివేగంగా పోనివ్వడంతో.. కారు అదుపు తప్పి బోల్తా పడింది. మర్జెన్సీ సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ముందు సీట్లలో కూర్చున్న మీర్జా అలీతో పాటు మరో స్నేహితురాలు తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. అయితే కారు బోల్తా పడటంతో వెనుక సీట్‌లో కూర్చున్న తాన్యా తీవ్ర రక్త స్రావం కావడంతో మరణించింది. 

అయితే త్యాన్యా మృతికి సంబంధించి, ఇంట్లో చోటుచేసున్న విషాదం గురించి ఫిరోజ్ ఖాన్ ఓ యూట్యూబ్ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. త్యాన్యా ఖాక్డే తన సొంత కూతురు కాదని.. ఆమెకు తాను స్టెప్ ఫాదర్‌ను అని చెప్పారు. తన భార్య లైలా ఖాన్ సౌతిండియాలో టాప్ బ్యూటీషియన్ అని చెప్పారు. ‘‘నేను ఆ రోజు మా ఫ్రెండ్ బర్త్‌ డే పార్టీకి వెళ్లాను. ఎయిర్‌పోర్ట్ రోడ్డులో యాక్సిడెంట్ అయిందని.. తాన్యాను ఉస్మానియా తరలిస్తున్నామని అర్దరాత్రి 12 గంటల తర్వాత ఫోన్ వచ్చింది. ఉస్మానియాకు తీసుకెళ్తారని చెప్పగానే.. నాకు ఏదో జరిగిందనే అనుమానం కలిగింది. 15 నిమిషాల తర్వాత నా చిన్న తమ్ముడు ఫోన్ చేసి తాన్య చనిపోయిందని చెప్పాడు’’ అని ఫిరోజ్ ఖాన్ చెప్పారు. 

తాన్యా ఫ్రెండ్ కొత్తగా కారు తీసుకున్నాడని చెప్పి ఆమెను, ఇతర స్నేహితులతో తీసుకుని బయటకు వెళ్లారు. కారును ర్యాష్‌గా నడిపి డివైడర్ ఎక్కించాడు.  రూఫ్ టాప్ ఓపెన్లో ఉండటంతో తాన్యా తల బలంగా రోడ్డుకు తాకడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అయితే తాన్యాకు 23 ఏళ్లు.. ఆమె నా సొంత కూతురు కాదు. ఆమెకు నేను స్టెప్ ఫాదర్‌ను. నాకు పెళ్లి జరిగిన సమయంలో తాన్యాకు ఐదేళ్లు. చాలా తేలివైన అమ్మాయి. స్కూల్‌లో టాపర్. కెనడాలో చదివింది. బీబీఏ సింగపూర్‌లో చదింది. కాన్వొకేషన్‌కు నేను, అమ్మ రావాలని కోరింది. నా భార్య లైలా ఖాన్.. సౌత్ ఇండియాలో టాప్ బ్యూటీషియన్. తాన్యా కూడా ఆమె దగ్గర నుంచి మేకప్ వేయడం నేర్చుకుంది. తాన్యా చాలా అందగా మేకప్ వేసేది.. అందుకే చాలా మంది ఆమెతో మేకప్ వేయించుకోవడానికి ఇష్టపడేవారు. గత ఆరు నెలలుగా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సంపాదించేది. అమెరికా నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఆరు నెలల తర్వాత అమ్మ చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటానంది.

నాతో తాన్యా ఒక ఫ్రెండ్‌లా ఉండేది. ఏదైనా డ్రెస్ కొనాలన్నా.. ఏం చేయాలన్నా నన్ను అడిగేది. తాను చనిపోయినప్పుడు మీడియాలో ఫిరోజ్ ఖాన్ కూతురు అని రాశారు. బతికి ఉన్నప్పుడు తాన్యా నన్ను అంకుల్ అని పిలుస్తోంది... నేను తాన్య అని పిలుస్తాను. చనిపోయాక మాత్రం తనకు తండ్రిగా మారాను. బిడ్డ చనిపోవడం అనేది.. తల్లిదండ్రులకు జీవితంలో అంతకు మించిన భారం ఉండదు. నేను మానసికంగా బలంగా ఉన్నాను కాబట్టి.. మాట్లాడగలుగుతున్నాను. కానీ నా భార్య పూర్తిగా కుంగిపోయింది. ఇంటికెళ్తే నా భార్యను అలా చూడలేకపోతున్నా. తనకే ఇలా ఎందుకు జరిగిందని ఆమె నన్ను అడుగుతుంది. ఆమె ఎంతో మందికి సాయం చేస్తుంది. 

ఆరు నెలల క్రితం ఆమె సొంత డబ్బుతో హై విజన్ అనే ఆర్గనైజేషన్ పెట్టింది. 44 మంది అమ్మాయిలను ఆ సంస్థ ద్వారా చదివిస్తోంది. దాని పేరును తాన్యా విజన్ అని మార్చుదామని నా భార్యను కోరాను. మనమంతా కలిసి మరింత మంది పిల్లలను చదివిద్దాం. ప్రతి అమ్మాయిలోనూ మన తాన్యాను చూసుకుందామన్నాను. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. యాక్సిడెంట్‌కు కారణమైన అబ్బాయిపై ర్యాష్ డ్రైవింగ్ కేసు బుక్ చేయించాను. కార్లో ఉన్న వాళ్లకు ఇంటర్నల్ ఇంజ్యూరీస్ అయ్యాయి. కానీ వాళ్లు క్షేమంగా ఉన్నారు. ఎయిర్‌పోర్టు దగ్గర 24 గంటలపాటు పబ్ తెరిచి ఉంటుంది. సిటీలో ఉన్న పబ్‌లన్నీ మూతపడితే.. యూత్ అంతా అక్కడికి వెళ్తారు. ఈ మధ్యే రేవంత్ రెడ్డి సీపీతో మాట్లాడి దాన్ని మూసివేయించారు’’ అని ఫిరోజ్ ఖాన్ తెలిపారు. 

కారు నడిపిన వ్యక్తిపై అటాక్ చేశాననే వార్తలపై ప్రశ్నించగా.. మీర్జా కారులో ఉన్నాడని కొట్టానని, ఒకవేళ వాడు కారు నడిపిస్తున్నాడని తెలిస్తే 100 శాతం రివాల్వర్ తీసి షూట్ చేసేవాడినని ఫిరోజ్ ఖాన్ చెప్పారు. ‘‘తాన్యా కారు తీసుకెళ్లింది. ఆమె కారు ప్రమాదానికి గురైందని నాకు ముందు చెప్పారు. మూడు గంటల తర్వాత కారు నడిపింది మీర్జా అని తెలిసింది. ర్యాష్ డ్రైవింగ్ వల్లే నా కూతురు చనిపోయిందని అక్కడి వారు చెప్పారు. ఎయిర్‌పోర్టులోని పబ్, ఫుడ్ జాయింట్స్ వల్లే ఇదంతా జరిగింది. అక్కడ ప్యాసింజర్స్ 5 శాతమేనని.. 95 శాతం ఇలా వెళ్లేవారే. నేను వెళ్లి చూస్తే.. క్కడ 30 శాతం మంది గంజాయి తాగుతున్నారు. ఇది మన ఎయిర్‌పోర్ట్ పరిస్థితి’’ అని ఫిరోజ్ ఖాన్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios