పార్టీ అంతర్గత ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రాజేశాయి. ఎన్‌ఎస్‌యూఐ సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం జరిగిన ఎన్నికలు యువ నాయకుల మద్య గొడవకు దారితీశాయి. ఏకంగా గాంధీభవన్ సాక్షిగానే ఓ బడా నేత కొడుకు, గెలుపొందిన నాయకున్ని పట్టుకుని దాడికి దిగాడు. దీంతో అర్థరాత్రి సమయంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఇటీవలే సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ నియమితులైన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్ సిటీ ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్ పదవి కోసం నిన్న గాంధీభవన్ లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కోసం నలుగురు యువ నాయకులు పోటీపడ్డారు. అయితే హోరా హోరి పోరు మాత్రం అంజన్ కుమార్ యాదవ్ అల్లుడు సుఖేష్ యాదవ్ మరియు మరో యువ నాయకుడు అభిజిత్ ల మద్య జరిగింది.

అయితే నిన్న జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపును సాయంత్రం పరిశీలకులు ప్రారంభించారు. అయితే ఈ లెక్కింపు అర్థరాత్రి పూర్తవగా అప్పుడు ఎన్నికల పరిశీలకులు ఫలితాలను ప్రకటించారు. ఇందులో సుఖేష్ యాదవ్ పై అభిజిత్ గెలుపొందాడు.

దీంతో బావ ఓటమిని తట్టుకోలేక పోయిన అంజనీ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్ తన అనుచరులతో అభిజిత్ ఇంటిపై దాడికి దిగాడు. ఈ దాడిలో అభిజిత్ తో పాటు అతడి అనుచరులు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై అభిజిత్ బేగంబజార్‌, కాచిగూడ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.