Asianet News TeluguAsianet News Telugu

చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు: హైకోర్టులో ఆది శ్రీనివాస్ పిటిషన్

 వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్  హైకోర్టును ఆశ్రయించారు.

Congress leader Adi Srinivas files caveat petition in High court over chennamaneni Ramesh citizenship
Author
Hyderabad, First Published Nov 21, 2019, 12:57 PM IST


హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్  హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ గురువారం నాడు  హైకోర్టును ఆశ్రయించారు.

Also read:చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు: హైకోర్టులో ఆది శ్రీనివాస్ పిటిషన్

తనకు తెలియకుండా ఎలాంటి ప్రక్రియ చేపట్టరాదని పిటిషన్ దాఖలు చేశారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్  భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  వేములవాడ అసెంబ్లీ స్థానం నుండి   చెన్నమనేని రమేష్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఆది శ్రీనివాస్ పోటీ చేశారు.

Also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేనికి హోంశాఖ షాక్, భారత పౌరసత్వం రద్దు: అనర్హత వేటేనా..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్  పౌరసత్వం వివాదంపై మూడు నెలల్లోపు తేల్చాలని కేంద్ర హోంశాఖను  ఈ ఏడాది జూలై 10వ తేదీన హైకోర్టు ఆదేశించింది  చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదంపై  ఆయన ప్రత్యర్ధి శ్రీనివాస్  దాఖలు చేసిన  పిటిషన్‌పై బుధవారం నాడు హైకోర్టు విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వం లేదని  విదేశీ పౌరసత్వం ఉందని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనా చెల్లదని శ్రీనివాస్  హైకోర్టును ఆశ్రయించారు.  

ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై ఉన్న అభ్యంతరాలను  మూడు వారాల్లో కేంద్ర హోంశాఖకు తెలపాలని పిటిషనర్  శ్రీనివాస్ కు కోర్టు సూచించింది. మరో వైపు ఈ విషయమై మూడు వారాల్లో స్పష్టత ఇవ్వాలని  కేంద్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది.చెన్నమనేని రమేష్ గత టర్మ్‌లో కూడ  టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈ దఫా మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చుక్కెదురు అయ్యింది. ద్వంద్వ పౌరసత్వం కలిగిఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ప్రకటించారు. అయితే చెన్నమనేని రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందే  కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios