న్యూఢిల్లీ: టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చుక్కెదురు అయ్యింది. ద్వంద్వ పౌరసత్వం కలిగిఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగిఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది.

ఇకపోతే వేములవాడ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు చెన్నమనేని రమేష్. చెన్నమనేని రమేష్ అభ్యర్థిత్వంపై రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ పోరాటం చేశారు. చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కలిగిఉన్నారంటూ ఆరోపించారు. 

విపక్షాల నేతలు న్యాయస్థానాలతోపాటు కేంద్రప్రభుత్వాన్ని సైతం ఆశ్రయించారు. దాంతో కేంద్ర హోంశాఖ విచారణ చేపట్టింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై విచారణకు హాజరు కావాల్సిందిగా సూచించింది. కేంద్రం ఆదేశాలతో తన పౌరసత్వంపై చెన్నమనేని రమేష్ పలు ఆధారాలు కేంద్ర హోంశాఖకు సమర్పించారు. 

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై విచారణ అనంతరం కేంద్రం హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారన్న నిర్ధారణ కావడంతో భారతదేశ పౌరసత్వాన్ని రద్దు చేసింది.  

భారతదేశ పౌరసత్వానికి చెన్నమనేని అనర్హుడంటూ తేల్చి చెప్పింది. దాంతో చెన్నమనేని రమేష్ పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఇకపోతే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ పోరాటం చేశారు. 

ఇకపోతే  ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని మూడు నెలల్లోపు తేల్చాలని తెలంగాణ హైకోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరసత్వంపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని చెన్నమనేనికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే.  

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ తప్పుడు మార్గాలలో పౌరసత్వం కలిగి ఉన్నారని గుర్తించింది. దాంతో చెన్నమనేని రమేష్‌ భారత పౌరుడిగా కొనసాగడానికి అర్హత లేదని తేల్చి చెప్పేసింది. 

ఈ మేరకు భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపోతే గతంలో చెన్నమనేని రమేష్ జర్మనీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన సంగతి తెలిసిందే.