అగ్రనేతలపై విమర్శలకు షోకాజ్: కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ముందు హాజరైన అద్దంకి దయాకర్

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ సోమవారం నాడు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసు ఇవ్వడంతో క్రమశిక్షణ సంఘం ముందు దయాకర్ అటెండ్ అయ్యారు.
 

Congress Leader Addanki Dayakar Attend Before Disciplinary Committee in Hyderabad


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ సోమవారం నాడు హాజరయ్యారు. పార్టీ ఇచ్చిన నోటీసుకు సంబంధించి వివరణ ఇచ్చినట్టుగా 
Addanki Dayakar చెప్పారు.

ఇటీవల న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి Congress పార్టీ కీలక నేతలపై విమర్శలు చేశారు. Uttamkumar Reddy, Komatireddy Venkat Reddy, దామోదర్ రెడ్డి లపై విమర్శలు చేశారు. ఈ విషయమై మాజీ మంత్రి Ramreddy Damodar Reddy  పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఆదివారంనాడు సమావేశమైంది. కాంగ్రెస్ Disciplinary Committee  చైర్మెన్ Chinna Reddy అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశం అద్దంకి దయాకర్ కి Show Cause నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసులు అందుకున్న అద్దంకి దయాకర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యారు. పార్టీ క్రమశిక్షణ సంఘం అడిగిన విషయాలపై అద్దంకి దయాకర్ వివరణ ఇచ్చారు.

2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానం నుండి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశాడు. ఆ సమయంలో Thungathurthiనుండి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరొకరికి టికెట్ ను ఇప్పించుకొనే ప్రయత్నం చేశారు. కానీ పార్టీ నాయకత్వం అద్దంకి దయాకర్ కి టికెట్ ఇచ్చింది. 

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇంకా తన పట్టును నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకొంటున్నాయి. ఈ విషయమై  పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోయిందని అద్దంకి దయాకర్ వర్గం వాదిస్తుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని దయాకర్ విమర్శలు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios