మంద కృష్ణ మాదిగతో కాంగ్రెస్ కొప్పుల రాజు భేటీ

congress koppula raju met manda krishna
Highlights

  • మంద కృష్ణ కుమార్తె, అల్లుడును ఆశీర్వదించిన కొప్పుల రాజు

 

ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగతో ఎఐసిసి ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షులు కొప్పుల రాజు భేటీ అయ్యారు. మంద కృష్ణ నివాసానికి కొప్పుల రాజు వెళ్లారు. మంద కృష్ణ కుమార్తె డా కృష్ణవేణి, అల్లుడు డాక్టర్ పృథ్విరాజు లను కొప్పుల రాజు ఆశీర్వదించచారు. ఈ సందర్భంగా ఎస్ సి వర్గీకరణ చట్టబద్ధత కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చర్చ పెట్టాలని కోరుతూ మంద కృష్ణ వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేత ప్రధాన మంత్రికి వర్గీకరణ కోరుతూ లేఖ రాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిసస్తున్న అప్రజాస్వామిక విధానాల పైన, భవిష్యత్ రాజకీయ పరిణామాలు మీద చర్చించారు.

బిజెపి వర్గీకరణ పైన మాదిగలను మోసం చేస్తుంటే ప్రతి పక్షంగా,వర్గీకరణ పైన ఉషా మేహ్ర కమీషన్ ను నియమించిన పార్టీగా కాంగ్రెస్ మౌనంగా ఉండడం సరికాదు అని మంద కృష్ణ వివరించారు. బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు రాహుల్ గాoధీ చేత లేఖ రాయించే ప్రయత్నం చేస్తానని ,పార్లమెంట్లోనూ లేవనెత్తతామని కొప్పులరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో MSF రాష్ట్ర అద్యక్షులు గోవిందు నరేష్ మాదిగ,మాదిగ మేధావుల సంఘం నేత డా బాబురావు,డా రమేష్,తదితరులు పాల్గొన్నారు.

loader