Asianet News TeluguAsianet News Telugu

రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ : సీఎల్పీ నేత భట్టి సహా పలువురి అరెస్ట్

 రాజ్ భవన్  ముట్టడికి  కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో    పోలీసులు అప్రమత్తమయ్యారు.  రాజ్ భవన్  వెళ్లే   రోడ్లను  పోలీసులు మూసివేశారు. 

Congress holds Rally From Gandhi Bhavan To Raj Bhavan , Congress leaders Arrested
Author
First Published Mar 15, 2023, 12:46 PM IST

హైదరాబాద్:  గాంధీ భవన్ నుండి  రాజ్ భవన్ కు  కాంగ్రెస్ నేతలు  బుధవారంనాడు ర్యాలీ చేపట్టారు.  అదానీ షేర్ల కుంభకోణం తో ప్రజా సంపద  ఆవిరైందంటూ   కాంగ్రెస్ నేతలు  నిరసనకు పిలుపునిచ్చారు. బుధవారంనాడు రాజ్ భవన్ ముట్టడికి  పిలుపునిచ్చారు.  అదానీ కుంభకోణంపై  పార్లమెంటరీ  కమిటీతో  విచారణ  జరిపించాలని  కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదానీ  పై  హిండెన్ బర్గ్  నివేదికపై  ప్రధానమంత్రి ఎందుకు నోరు మెదపడం లేదో  చెప్పాలని  కాంగ్రెస్ నేతలు  ప్రశ్నించారు. 

ఖైరతాబాద్  సర్కిల్ వద్దకు  చేరుకున్న కాంగ్రెస్ నేతలను  పోలీసులు అరెస్ట్  చేశారు. రాజ్ భవన్ వైపు వెళ్లే కాంగ్రెస్ నేతలను  పోలీసులు అడ్డుకున్నారు.రాజ్ భవన్   వైపు కాంగ్రెస్ కార్యకర్తలు  అడ్డుకుంటున్నారు.రాజ్ భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో  పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో  పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య  తోపులాట, వాగ్వాదం  చోటు  చేసుకుంది.  దరిమిలా ఉద్రిక్తత  నెలకొంది.

ఖైరతాబాద్  సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు బైఠాయించి  నిరసనకు దిగారు. మాజీ మంత్రి  పొన్నాల లక్ష్మయ్య  సహా  పలువురు నేతలు  ఖైరతాబాద్  సర్కిల్ వద్ద  బైఠాయించారు.  దీంతో  ఖైరతాబాద్  సర్కిల్ వద్ద  రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి.  దరిమిలా పోలీసులు  కాంగ్రెస్ నేతలను  అరెస్ట్  చేసి  సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాజ్ భవన్ కు సమీపంలో  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను పోలీసులు అరెస్ట్  చేశారు. ములుగు ఎమ్మెల్యే  సీతక్క ను కూడ పోలీసులు అరెస్ట్  చేశారు 

కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన  నేపథ్యంలో  రాజ్ భవన్ వద్ద భారీగా  పోలీసులను మోహరించారు. రాజ్ భవన్  వైపు వెళ్లే రోడ్లను పోలీసులు మూసివేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios