హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఘోర ఓటమిని ఆ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరపనుంది. ఇందుకోసం ఢిల్లీ రావాలని తెలంగాణలోని పార్టీ నేతలను ఆదేశించింది.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఘోర ఓటమిని ఆ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి రావాలని పార్టీ హైకమాండ్ (congress high command) ఆదేశించింది. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరపనుంది. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ లీడర్, ఏఐసీసీ కార్యదర్శి హాజరు కావాలని పార్టీ అధిష్టానం తెలిపింది.
హుజురాబాద్‌లో దారుణమైన ఓటమికి గల కారణాలపై హైకమాండ్ చర్చించనుంది. ముఖ్యంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం దారుణంగా పడిపోవడంపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కొందరు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పడిపోవడంపై కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఓటమిపై సమీక్ష జరపాలని అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మొదటి నుంచి వెనకబడిన సంగతి తెలిసిందే. అభ్యర్థి ఖరారు విషయంలో చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణిని అవలంభించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలు మినహా.. ఇతర ముఖ్య నేతలు అటువైపు చూడలేదు. ఈ పరిణమామాల నేపథ్యంలో ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఓటమికి పూర్తి బాధ్యత తానేనని Revanth Reddy ప్రకటించారు.
అయితే హుజురాబాద్ ఓటమిపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసమే కాంగ్రెస్ ఇలా చేసిందనే ఆరోపణలు సైతం వినిపించాయి. ఈ క్రమంలోనే Congress Political Affairs Committee సమావేశం నిర్వహించారు. ఈ కమిటీ సమావేశం సుధీర్ఘంగా జరిగింది.ఈ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపైనే పార్టీ నేతలు సీరియస్ గా చర్చించారు.పార్టీ అంతర్గత వ్యవహరాలపై పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనే చర్చించాలని పార్టీ నేతలకు మాణికం ఠాగూర్ ఆదేశించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకపోతే రాహుల్, సోనియాగాంధీతో చర్చించాలని ఆయన సూచించారు. పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని ఠాగూర్ అభిప్రాయపడ్డారు. నేతలతో సమిష్టిగా వ్యవహరించాలని ఠాగూర్ సూచించారు. ఇక, ఈ ఓటమిపై నివేదిక ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
