తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : సమన్వయ కమిటీని నియమించిన కాంగ్రెస్ హైకమాండ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సభ్యులుగా మాణిక్ రావు థాక్రే , జానారెడ్డి, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లను నియమించింది.  

congress high command appoints coordinating committee for telangana assembly elections ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని నేరుగా పర్యవేక్షిస్తోంది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది హైకమాండ్. సభ్యులుగా మాణిక్ రావు థాక్రే , జానారెడ్డి, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్‌లను నియమించింది.  అలాగే చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి ఏఐసీసీ పరిశీలకుడిగా ఎంకే విష్ణుప్రసాద్‌ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. 

కాగా.. దూకుడు మీదున్న కాంగ్రెస్ ఎలాగైనా అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ముందుకు న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకుంది. అయితే, వామపక్ష, కాంగ్రెస్ మధ్య సీట్ల చర్చల నేప‌థ్యంలో ఉమ్మడి ఖమ్మం, నల్డొండ జిల్లా హస్తం సీనియర్ నేతలను ఆందోళనకు గుర‌వుతున్నారు. సీట్ల పంప‌కాల క్ర‌మంలో త‌మ‌కు సీటు ద‌క్కుతుందో లేదోన‌ని ప‌లువురు నేత‌లు గుబులుప‌డుతున్నార‌ని జిల్లా రాజ‌కీయాల్లో టాక్ వినిపిస్తోంది.

ఖమ్మంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, ఇతర పార్టీల నుంచి కొత్తగా చేరిన నాయకులకు గుండెల్లో మంట పుట్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కేవలం మూడు జనరల్ స్థానాలు మినహా కాంగ్రెస్ టికెట్ల కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి ఇటీవల పార్టీలో చేరిన టికెట్ ఆశావహులతో పాటు ఇప్పటికే టికెట్ల కోసం ఆశావహులు చాలా మంది ఉన్న తరుణంలో వామపక్షాలకు పోటీ చేయడానికి కొన్ని సీట్లు కేటాయించడం కాంగ్రెస్ కు కష్టకాలమే అని చెప్పాలి.

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు: అసంతృప్తుల బుజ్జగింపులకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీ

సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. వామపక్షాలు కూడా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సీట్లు అడుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్టీలకు ఐదు, ఎస్సీలకు రెండు స్థానాలు రిజర్వు చేయడంతో పాటు పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో మునుగోడు, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కావాలని సీపీఐ కోరుతోంది. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, నల్లగొండ జిల్లా మిర్యాలగూడను సీపీఎం కోరుతోంది. ఇప్పటికే భద్రాచలంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నారు. సిట్టింగ్ సీటు ఇవ్వకపోతే వీరయ్యకు మరో సీటు ఇవ్వాల్సి ఉంటుంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమ మద్దతుదారులకు టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తుండగా, సీపీఐకి ఒక స్థానం, సీపీఎంకు ఒక సీటు ఇచ్చేందుకు టీపీసీసీ ప్రయత్నిస్తోంది. ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపుపై చర్చించేందుకు ఈ నెల 10న ఏఐసీసీ, స్క్రీనింగ్ కమిటీ సభ్యుల నుంచి పొంగులేటి శ్రీనివాస్ కు పిలుపు వచ్చినట్లు సమాచారం. సీట్ల పంపకాల కోసం కాంగ్రెస్, వామపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, అయితే ఇది ప్రారంభ దశలో ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios