Asianet News TeluguAsianet News Telugu

’తెలంగాణా’ కష్టాల నుంచి కాంగ్రెస్ గట్టెక్కుతుందా?

తెలంగాణాలో ముదరనున్న ప్రతిపక్షాల  కష్టాలు

రైతుల, విద్యార్థుల సమీకరణతో గట్టెక్కే ప్రయత్నం

రాష్ట్ర వ్యాపిత విద్యార్థి ఉద్యమానికి కాంగ్రెస్ సమాయత్తం

Congress facing post Telangana crisis

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల బాటపడుతూ ఉంది. ప్రత్యేక రాష్ట్రం అందించాకా కూడా ప్రజల మన్నన పొందలేకపోవడంతో  ఈ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో మనగడ కోసం పెద్ద పోరాటం చేయాల్సివస్తున్నది. తెలంగాణాలో మారుతున్న భౌగోళిక రాజకీయా నేపథ్యంలో 2019 నాటికి ఎన్నికల్లో పోటీ చేయగల జవసత్వాలు తెచ్చుకునేందుకు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు బాగానే శ్రమిస్తున్నారనక తప్పదు.

 

తెలంగాణా తెచ్చిన ఊపు  మీద ఉరలేస్తున్న అధికార పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితిని కట్టడి చేసేందుకు అన్ని రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక ఏడాదిగా క్షణం తీరిక లేకుండా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ  ఏదో ఒక ఉద్యమం చేస్తూ ఉంది. ఒక వైపు నుంచి రైతులను సమాయత్తం చేస్తూ ఉంది. మరొక వైపు ముస్లింలకు ఎన్నికలపుడు చెప్పిన  12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే నని పట్టుబడుతూ ఉంది.

తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు కాంగ్రెస్ కే కాదు, ఇతర ప్రతిపక్షపార్టీలన్నింటికి  ఒక పెద్ద సవాల్ విసరనుంది. ఇది 2008 నాటి రియల్ ఎస్టేట్ బూమ్ తీసుకురానుంది. కొత్త జిల్లా కేంద్రాలలో వివిధ కార్యాలయాలతో పాటు, రింగ్ రోడ్ల వంటి ని ర్మాణాలు మొదలయితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొస్తాయి. జిల్లాలోకి హోటల్లు బార్లు వంటివి విస్తరిస్తాయి. ఉత్పత్తి లేకపోయినా జనం చేతుల్లో నగదు మారుతూ ఉంటుంది. ఇది రాజకీయనాయకులకు, వ్యవసాయం గిట్టక భూములనుఎండబెట్టుకుంటున్న పేదరైతులకు, రియల్ వ్యాపారులకు, దందాదారులకు, ఎక్కడో ఒక చోట పదిగజాల జాగా కొనుక్కోవాలనుకునేవారికి కొత్త మార్కెట్ ను సృష్టిస్తుంది. ప్రభుత్వం అదాయం పెరుగుతుంది. ప్రభుత్వం కార్యకలాపాలు పెరుగుతాయి. ఈ సందడిలో కాంగ్రెస్ నే కాదు, ప్రతిపక్ష పార్టీలను ఎవరైనా పట్టించుకుంటారా?

 

ఇపుడు తాజాగా రాష్ట్ర వ్యాపితంగా విద్యార్థులను తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడగట్టేందుకు పూనుకుంది. విద్యార్థులకు ప్రభుత్వం బకాయీ ఉన్న పీజులను వెంటనే చెల్లించాలని  రాష్ట్రమంతా సుడిగాలి ఉద్యమాలను నడిపేందుకు పూనుకుంది.  పెద్దింటి బిడ్డలాగా సమస్యలకు దూరంగా బతుకూ వచ్చిన  తన అనుబంధ సంస్థ ఎన్ఎస్ యుఐని రంగంలోకి దించింది. ఫీజు బకాయీలను చెలించాలని దరఖాస్తు సేకరణ ఉద్యమాన్ని నిర్వహించింది. నిన్న దిల్ షుక్ నగర్ పోరుగర్జన నిర్వహించింది.

 

ఫీజు రియంబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించి పేద విద్యార్థుల‌ను ఆదుకోవాల‌నే ప్ర‌ధాన డిమాండ్‌తో టిపిసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నిజామాబాద్ జిల్లా  ఆర్మూరులో గ్రామీణ విద్యార్థి యువ ఘ‌ర్జ‌న నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి టిపిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎఐసిసి కార్య‌ద‌ర్శి రాంచంద్ర కుంటియా, మండ‌లి విప‌క్ష నేత ష‌బ్బీర్ అలీ, ఎఐసిసి ఎస్‌.సి సెల్ చైర్మ‌న్ కొప్పుల రాజు, ఎఐసిసి అధికార ప్ర‌తినిధి మ‌ధు యాష్కి, మాజీ స్పీక‌ర్ సురేశ్ రెడ్డి, డిసిసి అధ్య‌క్షులు, ఎం.ఎల్‌.సి ఆకుల ల‌లిత, ఎన్‌.ఎస్‌.యు.ఐ రాష్ట్ర అధ్య‌క్షులు బ‌ల్మూరు వెంక‌ట్ త‌దిత‌రులు పాల్గొంటారు.

 

శనివారం నాడు హుజూర్ నగర్ లో జరుగుతంది. ఇదే విధంగా రాష్ట్రమంతా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థుల ఉద్యమ వెల్లువ సృష్టించాలన్నది కాంగ్రెస్ ఆరాటం. దీనికోసం చక్కటి భాషతో కాన్సెప్ట్ కూడా తయారు చేసుకుంది. “కేసీఆర్ ప్రభుత్వం తీరుతో విద్యారంగం సంక్షోభం లో పడింది. తెలంగాలో ఇప్పుడు విద్యార్థులు నిరాశ, నిస్పృహలకు గుర్తెతున్నారు. ఫీజు బకాయిలు ఏప్రెల్ వరకు చెల్లిస్తానని చెప్పిన కేసీఆర్... ఇప్పుడీ వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.ప్రభుత్వం మెడలు వంచేందుకే... ఫీజు రీయింబర్స్ మెంట్ పై కాంగ్రెస్ పోరు బాట పట్టింది.కాంట్రాకులకు బిల్లులు ఆపండి... .ముందు విద్యార్థులకు ఫీజులు చెల్లించండి.కమిషన్ ల కోసం కాంట్రాక్టర్లు లకు ప్రభుత్వం  బిల్లులు  చెల్లిస్తోంది.  విద్యార్థులను గాలికి వదిలేసింది.”

 

తెలంగాణా ఉద్యమంలోకి దూకివచ్చినట్లు ఎన్ఎస్ యుఐ  ఉద్యమంలోకి కూడా తెలంగాణా విద్యార్థులు వస్తారని కాంగ్రెస్ ఆశ. నవంబర్ నెలంతా సభలు సమావేశాలు నిర్వహించి, డిసెంబర్లో రాష్ట్రస్థాయిలో ఒక విద్యార్థి  మహాసభను నిర్వహించి,  ఈ సభకు రాహుల్ గాంధీనో , లేదా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీనో ఆహ్వానించి, విద్యార్థులనుంచి పీజు రియింబర్స్ మెంట్ బకాయీల దరఖాస్తులను అందచేయాలని వ్యూహంగా పెట్టుకుంది. ఓట్లకి,సీట్లకి ఇన్స్ఫిరేషన్ అయిన రాహుల్ తెలంగాణా విద్యార్థులలో  ఉద్యమాన్ని రాజేయగలడా?

 

తెలంగాణాలో కొత్త జిల్లాల ఏర్పాటు కాంగ్రెస్ కే కాదు, ఇతర ప్రతిపక్షపార్టీలన్నింటికి  ఒక పెద్ద సవాల్ విసరనుంది. ఇది 2008 నాటి రియల్ ఎస్టేట్ బూమ్ తీసుకురానుంది. కొత్త జిల్లా కేంద్రాలలో వివిధ కార్యాలయాలతో పాటు, రింగ్ రోడ్ల వంటి నిర్మాణాలు మొదలయితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొస్తాయి. జిల్లాలోకి హోటల్లు బార్లు వంటివి విస్తరిస్తాయి. ఉత్పత్తి లేకపోయిన జనం చేతుల్లో నగదు మారుతూ ఉంటుంది. ఇది రాజకీయనాయకులకు, వ్యవసాయం గిట్టక భూములనుఎండబెట్టుకుంటున్న పేదరైతులకు, రియల్ వ్యాపారులకు, దందాదారులకు, ఎక్కడో ఒక చోట పదిగజాల జాగా కొనుక్కోవాలనుకునేవారికి కొత్త మార్కెట్ ను సృష్టిస్తుంది. ప్రభుత్వం అదాయం పెరుగుతుంది. ప్రభుత్వం కార్యకలాపాలు పెరుగుతాయి. ఈ సందడిలో కాంగ్రెస్ నే కాదు, ప్రతిపక్ష పార్టీలను ఎవరు పట్టించుకుంటారు?

 

తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలకు ఎదురుకానున్న రాజకీయ సంక్షోభం ఇది. దీని నుంచి బయటపడేందుకే కాంగ్రెసే, సిపిఎం, బిజెపి ఉద్యమాలకు పూనుకుంటున్నాయనిపిస్తుంది. ఎవరు గెలుస్తారో చూడాలి.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios