కాంగ్రెస్‌తో కొనసాగుతున్న చర్చలు: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

కాంగ్రెస్ పార్టీతో  లెఫ్ట్ పార్టీల చర్చలు కొనసాగుతున్నాయని  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.  

Congress Decided to give Two Assembly Seats CPI lns

హైదరాబాద్: తమకు  కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ సీట్లను  కాంగ్రెస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని  సీపీఐ జాతీయ కార్యదర్శి   నారాయణ చెప్పారు. బుధవారంనాడు  హైద్రాబాద్‌లో సీపీఐ  జాతీయ కార్యదర్శి  నారాయణ మీడియాతో మాట్లాడారు. పొత్తుపై  అధికారిక ప్రకటనే తరువాయి అని  నారాయణ తెలిపారు.సీపీఎంతో  కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయినందుకు బీఆర్ఎస్ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

బీఆర్ఎస్ కు బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందని ఆయన  విమర్శించారు.బీఆర్ఎస్ పై కొట్లాడిన బండి సంజయ్ ను అన్యాయంగా తొలగించారన్నారు.. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు పనిచేస్తామని నారాయణ చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో  సీపీఐ, సీపీఎంలతో కలిసి పోటీ చేయాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంంది. రెండు పార్టీలకు రెండేసీ అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని  నిర్ణయం తీసుకుంది.  సీపీఐకి  కొత్తగూడెం,మునుగోడు అసెంబ్లీ స్థానాలను  కేటాయించనుంది.  మరో వైపు మిర్యాలగూడతో పాటు మరో అసెంబ్లీ స్థానాన్ని సీపీఎంకు  కేటాయించనుంది.  ఖమ్మంలోని  పాలేరు సీటుపై  సీపీఎం పట్టుబడుతుంది.

 పాలేరు కాకుండా  వైరా అసెంబ్లీ స్థానం ఇవ్వాలని  కాంగ్రెస్ ప్రతిపాదిస్తుంది. కానీ  వైరా తీసుకొనేందుకు  సీపీఎం సానుకూలంగా లేదు. వైరా  అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  పోటీ చేస్తారని  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. తాము కోరిన  సీట్లు ఇవ్వకలేకపోతే  ఒంటరిగా పోటీ చేస్తామని కూడ  సీపీఎం ఇప్పటికే తేల్చి చెప్పింది.

also read:బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా:కాంగ్రెస్ కు లాభమేనా?

2022  అక్టోబర్ మాసంలో  జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలు  బీఆర్ఎస్ కు మద్దతును ప్రకటించాయి. అయితే ఈ ఏడాది ఆగస్టు మాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉన్నప్పటికి  అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంపై  లెఫ్ట్ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి.

ఈ అవకాశాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించింది. సీపీఐ, సీపీఎంలతో  పొత్తును ప్రతిపాదించింది.   రెండేసీ  అసెంబ్లీ స్థానాలను  ఇవ్వాలని  కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.  ఏఏ అసెంబ్లీ స్థానాలను కేటాయించే విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.తాము కోరిన అసెంబ్లీ సీటును  ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర నాయకత్వం కోరుతుంది.ఈ విషయమై సీపీఎం రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించేందుకు  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరితో కాంగ్రెస్ నాయకత్వం సంప్రదింపులు  చేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios