నల్గొండలో ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ చిన్న విషయానికి ముగ్గురు యువకులను చితకబాదాడు. దీంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
నల్గొండ : nalgonda జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడలో ఓ Congress Councilor వీరంగం సృష్టించాడు. కౌన్సిలర్ జానీ అండ్ గ్యాంగ్ ముగ్గురు యువకులను చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. స్థానిక వెంకటేశ్వర థియేటర్ లో సినిమా చూసేందుకు కౌన్సిలర్ జానీ బంధువులు వెళ్లారు. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా సినిమా చూస్తున్నారు.
ఈ క్రమంలో లో ఓ సమయంలో జానీ బంధువు, సదరు యువకులు(నాగరాజు, సతీష్, సాయి తేజ)ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఈ విషయాన్ని ఆ వ్యక్తి కౌన్సిలర్ జానీకి తెలియజేశాడు. తన బంధువుతోనే గొడవకు దిగుతారా? అంటూ జానీ తన గ్యాంగ్ ని తీసుకొని థియేటర్ వద్దకు వచ్చి హల్ చల్ చేశాడు. అంతటితో ఆగకుండా.. జానీతో పాటు వచ్చిన 20 మందితో కూడిన గ్యాంగ్ కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశారు. వారి దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఇదిలా ఉండగా, ఏపీలోనూ కౌన్సిలర్ ల వేధింపుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మే 19న తనను వేధిస్తున్న YCP Councilor మీద వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. Sri Sathyasai District పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను Liquorనికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్థరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు.
దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుగొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు బుధవారం పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.
కాగా, ఏప్రిల్ 18న సూర్యాపేట జిల్లాలోని కోదాడలో యువతిపై మూడు రోజులుగా ఇద్దరు యువకులు అత్యాచారం చేసారు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడడంతో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమారుడు ఉన్నాడు.
ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తాను ఆటోలో వెళ్తుంటే నిందితులు తనను లాక్కెళ్లారని బాధితురాలు చెబుతోంది. చీకటి డిన తరువాత ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తాగించడంతో తాను స్పృహ కోల్పోయానని, పక్కింటివాళ్లు చూసి తనను కాపాడారని ఆమె చెప్పింది.
