Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మ చీరల పంపిణీపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు...

బతుకమ్మ పండగను పురస్కరించుకుని గత సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కూడా చీరల పంపిణీ ఉంటుందని ఆపద్దర్మ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో ఈ బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
 
congress complaint to ec against bathukamma saree distribution
Author
Hyderabad, First Published Sep 29, 2018, 3:17 PM IST

బతుకమ్మ పండగను పురస్కరించుకుని గత సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం కూడా చీరల పంపిణీ ఉంటుందని ఆపద్దర్మ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో ఈ బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారం లేకుండా చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడూరి నారాయణ రెడ్డి సూచించారు. అందుకోసం ఆయన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్కు లేఖ రాశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొనడం వల్ల ప్రచారం జరుగుతుందని... కాబట్టి వారు పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని నారాయణ రెడ్డి కోరారు.

ఇలాంటి చర్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని గూడూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి కేవలం ప్రభుత్వ అధికారులే ఈ కార్యక్రమంలో పాల్గొని అర్హులకు చీరలు పంపిణీ చేసేలా చూడాలని నారాయణ రెడ్డి ఈసీని కోరారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios