Asianet News TeluguAsianet News Telugu

బంగారు కుటుంబమైతే అయింది: కేసీఆర్‌‌పై రాహుల్

బంగారు తెలంగాణ కాదు... బంగారు కుటుంబంగా మారిందని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు.

congress chief rahulgandhi satirical comments on kcr
Author
Hyderabad, First Published Dec 3, 2018, 4:14 PM IST

తాండూరు: బంగారు తెలంగాణ కాదు... బంగారు కుటుంబంగా మారిందని  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత   తెలంగాణ ప్రజల కలలు సాకారం కాలేదన్నారు. 

సోమవారం నాడు తాండూరులో నిర్వహించిన ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన  గుర్తు చేశారు.

తెలంగాణ స్వప్నం సాధించుకోవడం కోసం  యువకులు  ఆత్మ బలిదానాలు చేసుకొన్నారని ఆయన ప్రస్తావించారు.తెలంగాణ రాష్ట్రం  ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని  భావించామన్నారు. కానీ,  సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో  వేలాది కోట్లను  దోచుకొన్నాడన్నారు.

తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌తో  అప్పగించినట్టు చెప్పారు. కానీ  ఈ నాలుగు ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగేదేమీలేదన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో  బంగారు తెలంగాణ కోసం కలలు కన్న ప్రజలు సాకారం కాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఆస్తులు 400 రెట్టు పెరిగాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకాలను  టీఆర్ఎస్  నీరుగార్చారని చెప్పారు.  రుణమాఫీని ఏ మేరకు అమలు చేశారో మీకు తెలుసునని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలు నోచుకోలేదన్నారు.

బంగారు తెలంగాణ.... కేసీఆర్ పాలనలో బంగారు కుటుంబంగా మారిందని రాహుల్ ఆరోపించారు.ప్రజా కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాలకు  లక్ష రూపాయాలను గ్రాంట్  ఇస్తామన్నారు.  మహిళలు వ్యాపారుల కోసం రూ. 500 కోట్లతో నిధిని ఇస్తామన్నారు.  మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షలను రుణంగా ఇస్తామని ప్రకటించారు.

మీ డబ్బులను మీ కోసం ఖర్చు చేస్తామని  రాహుల్ హామీ ఇచ్చారు. ప్రతి మండల కేంద్రంలో  30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు.  పంచాయితీరాజ్ వ్యవస్థను  పూర్తిగా కేసీఆర్ నిర్వీర్యం చేసినట్టు రాహుల్ ఆరోపించారు.

తెలంగాణలో యువతకు సంపూర్ణ భద్రతను కల్పిస్తామన్నారు.ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగభృతిని రూ.3వేలను ఇస్తామని చెప్పారు.ప్రభుత్వ బడ్జెట్‌ఋలో 20 శాతం నిధులను  కేటాయిస్తామన్నారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఎంఐఎం ఉందన్నారు. మహరాష్ట్ర, అసోంలలో బీజేపీకి అనుకూలంగా ఎంఐఎం మద్దతుగా  తమ అభ్యర్థులను బరిలోకి దింపిందన్నారు.

నాలుగేళ్లలో కేసీఆర్ సర్కార్ ప్రతి విషయంలో మోడీకీ మద్దతుగా నిలిచారని  ఆయన  గుర్తు చేశారు.మోడీకి కేసీఆర్ నమ్మినబంటుగా ఉన్నారని రాహుల్ విమర్శించారు.

రాబోయే ఎన్నికల్లో  మోడీని గద్దె దించుతామన్నారు. మోడీ బీ టీమ్ ‌గా కేసీఆర్ గా మారారన్నారు. కేసీఆర్ ను  మోడీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతారన్నారు.మోడీని  ప్రధానమంత్రిని చేయడం, తెలంగాణలో కేసీఆర్ సీఎం కావడమే లక్ష్యంగా చెప్పారు. టీఆర్ఎస్ అసలు పేరు టీ ఆర్ఎస్ఎస్ అంటూ  విమర్శించారు.

సంబంధిత వార్తలు

రెండు దశల్లో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ పూర్తి; రాహుల్

 

 

Follow Us:
Download App:
  • android
  • ios