తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.
గద్వాల: తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చెప్పారు.
సోమవారం నాడు గద్వాలలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
ఐదేళ్ల క్రితం తెలంగాణ ప్రజలు కొత్త తెలంగాణను చూస్తామని కలలు కన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల గురించి ప్రజలు కలలు కన్నారని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కలలు కన్నారని రాహుల్ గుర్తు చేశారు.
కేసీఆర్ సీఎం అయ్యాక ఓకే కుటుంబానికి ప్రయోజనం కలుగుతోందన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో మీ కలలన్నీ చిధ్రమయ్యాయని చెప్పారు.
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 10 వేల కోట్లు అవుతోందన్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనాలను 60వేల కోట్లకు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు.
ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో కేసీఆర్ వేలాది కోట్లను దోచుకొంటున్నారని రాహుల్ ఆరోపించారు. దీంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు కొత్త పేరు పెట్టారన్నారు. కావో చంద్రశేఖర్ రావు అని పేరు పెట్టారన్నారు.
కేసీఆర్ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదన్నారు.కేసీఆర్ కుటుంబం ఆస్తులు రెట్టింపు అయ్యాయన్నారు. నాలుగున్నర ఏళ్లలో లక్షన్నర కోట్లను అప్పులను తెచ్చిందన్నారు.
యూపీఏ ప్రభుత్వ హయంలో ఆదివాసీలు, రైతుల సంక్షేమం కోసం చేసిన చట్టాల,ను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే పామ్‌హౌజ్‌లో పడుకొంటానని కేసీఆర్ ప్రకటించారు.
ఐదేళ్ల క్రితం ప్రతి ఒక్కరికీడబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని హమీ ఇచ్చాడన్నారు. కానీ, ఒక్క ఇంటిని కూడ నిర్మించలేదన్నారు. దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమిని పంచుతామన్నారు. కానీ ఒక్క ఎకరం కూడ పంచలేదన్నారు.
300 కోట్ల ప్రగతి భవన్ లో కేసీఆర్ విశ్రాంతి తీసుకొంటాడు కానీ, తెలంగాణ ప్రజలకు ఒక్క ఇంటిని కూడ నిర్మించలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతుల చేతులకు కేసీఆర్ సర్కార్ బేడీలు వేశారని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ స్వంత ఇంటి కలను నెరవేరుస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.ఎస్పీ,ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. ఎస్సీలకు ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం విద్యకు కేటాయిస్తామన్నారు.
గడిచిన ఐదేళ్లలో మోడీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసిన విషయాల్లో మోడీకి కేసీఆర్ మద్దతు ప్రకటించారు.ఈ ఐదేళ్లలో ఎక్కడ సభ నిర్వహించినా మోడీ తనపై విమర్శలు చేశారని చెప్పారు.
తనపై ఎన్ని విమర్శలు చేసినా కూడ తాను ఒక్క అడుగు వేయబోనని రాహుల్ గాంధీ చెప్పారు.టీఆర్ఎస్ తెలంగాణ ఆర్ఎస్ఎస్ గా మారిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి సంబంధాలున్నాయని చెప్పారు. తెలంగాణలో ప్రజా కూటమి అధికారంలో వస్తోందన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 3, 2018, 2:24 PM IST