హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉదయ మోహన్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. పోటీకి ఉదయ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. దీంతో ఆయన స్థానంలో  కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పార్టీ టిక్కెట్ ఇచ్చింది.

రంగారెడ్డి జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్  పార్టీ తన అభ్యర్థిగా ఉదయ మోహన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టుగా సోమవారం నాడు ప్రకటించింది.

అయితే మంగళవారం నాడు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు. ఈ జిల్లా నుండి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడినా కూడ ఉదయ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  టిక్కెట్టు ఇచ్చింది. 

 కానీ, ఆయన పోటీకి నిరాకరించారు. దీంతో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. మంగళవారం నాడు కొమ్మూరి ప్రతాప్  రెడ్డికి పీసీసీ చీఫ్ బీ ఫారాన్ని కూడ అందించింది. రంగారెడ్డి కలెక్టరేట్ ‌లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.