Asianet News TeluguAsianet News Telugu

రూ.4 వేల కోట్ల బడ్జెట్ , ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ .. మహిళలకు రుణాలు : మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ , గిరిజన డిక్లరేషన్ విడుదల చేసిన ఆ పార్టీ.. తాజాగా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.

congress announced minority declaration over telangana assembly elections ksp
Author
First Published Nov 9, 2023, 7:36 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. అభ్యర్ధుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించిన కాంగ్రెస్.. ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. అలాగే ఆరు గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ , గిరిజన డిక్లరేషన్ విడుదల చేసిన ఆ పార్టీ.. తాజాగా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది.

ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వక్ఫ్ భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. మైనార్టీల సంక్షేమం కోసం ఎస్సీ సబ్ ప్లాన్ లా చట్టం తెస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ అమలును కేసీఆర్ మరిచిపోయారని దుయ్యబట్టారు. నాలుగు నెలల్లో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అన్నారని.. 2004లో సోనియా ఆదేశం మేరకు మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. 

మైనార్టీ డిక్లరేషన్ ముఖ్యాంశాలు:

ఆరు నెలల్లో కులగణన
అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు
రూ.4 వేల కోట్లతో మైనారిటీ బడ్జెట్ , మైనారిటీ సబ్ ప్లాన్
నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు
 

Follow Us:
Download App:
  • android
  • ios