Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభ ఎన్నికలు : తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది. రేపు వీరంతా నామినేషన్లు వేయనున్నారు. 
 

congress announced candidates from telangana for rajya sabha election 2024 ksp
Author
First Published Feb 14, 2024, 4:16 PM IST | Last Updated Feb 14, 2024, 4:26 PM IST

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది. అలాగే మధ్యప్రదేశ్ , కర్ణాటకల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో అశోక్ సింగ్ , కర్ణాటకలో అజయ్ మాకెన్, హుస్సేన్, చంద్రశేఖర్‌లను ఎంపిక చేసింది. రేపు వీరంతా నామినేషన్లు వేయనున్నారు. 

 

 

కాగా.. బీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు గాను ఫిబ్రవరి 8న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios