టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈటల అనుకూల నినాదాలు, ఉద్రిక్తత
కరీంనగర్ జిల్లా వీణవంకలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ఈటల వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఈటలకు మద్ధతుగా పలువురు నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు... ఈటల వర్గీయులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఈటల అనుచరులను బయటకు పంపారు.

మరోవైపు ఈ నెల 31వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకొన్నారు. బీజేపీ నేతలతో వరుసగా భేటీ అవుతున్న ఈటల రాజేందర్ కమలం గూటిలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.భూకబ్జా ఆరోపణలు రావడంతో కేబినెట్ నుండి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుండి కేసీఆర్ తప్పించారు. దీంతో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఈటల రాజేందర్ ను కలిశారు. మూడు రోజులుగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు జరిపారు బీజేపీ నేతలు ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉన్నారు.
Also Read:తెలంగాణ బిజెపికి షాక్... టీఆర్ఎస్ గూటికి హుజురాబాద్ కౌన్సిలర్ ప్రతాప మంజుల
బీజేపీ జాతీయ నాయకత్వం కూడ ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కమలదళం చెబుతుంది.రెండు రోజులుగా ఈటల రాజేందర్ తన అనుచరులతో ఈ విషయమై చర్చించారు. గురువారం నాడు ఉదయం టీజేఎస్ చీఫ్ కోదండరామ్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడ ఈటల రాజేందర్ తో చర్చించారు. గురువారంనాడు బీజేపీ కేంద్ర నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటల రాజేందర్ పార్టీలో చేరే విషయమై చర్చించారు. పార్టీ కేంద్ర నాయకత్వం కూడ ఈ విషయమై సానుకూలంగా స్పందించింది. ఇదే సమాచారాన్ని బీజేపీ నాయకత్వం ఈటల రాజేందర్ కు అందించింది.