తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై హెటిరో బాధిత సంఘం ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పార్థసార్థి రెడ్డి తప్పుడు  సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డిపై హెటిరో బాధిత సంఘం ప్రతినిధులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పార్థసార్థి రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రిమినల్ కేసు విషయాన్ని దాచిపెట్టారని, బ్లాక్ మనీ కేసును కూడా అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఆరోపించారు. పార్థసారధి రెడ్డిపై వేటు వేయాలని ఈసీని కోరారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని హెటిరో బాధితులు అన్నారు. ఇందుకు సంబంధించి కోర్టుకు కూడా వెళ్తామని.. ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంతమ్మ గూడెంలో పార్థసారధి రెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ వల్ల 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు చెప్పారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇందుక సంబంధించి ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. పార్థసారధి రెడ్డి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.