గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు మృతదేహం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఆయన పార్ధీవ దేహానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు నివాళి అర్పించారు. అనంతరం సైనికులు గౌరవ వందనం సమర్పించనున్నారు. ఆ తర్వాత ఓఆర్ఆర్ మీదుగా సంతోష్ స్వస్థలం సూర్యాపేటకు తరలించనున్నారు.