ఈమె తెలంగాణలో యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్. కలెక్టర్ గా పనిచేస్తున్నారు. జిల్లాలో అవినీతిపరులను, నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులను చీల్చి చెండాడుతారన్న పేరుంది. తాజాగా ఆమె కలెక్టర్ డ్యూటీలు చేస్తూనే బడిలో చిన్నారులకు పాఠాలు చెప్పింది. ఇంతకూ ఎవరా కలెక్టర్..? ఏమా కథ అనుకుంటున్నారా? చదవండి మరి.

వనపర్తి కలెక్టర్ గా పనిచేస్తున్న శ్వేతా మహంతి గత వారం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు పాఠాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. జిల్లాలోని గోపాల్ పేట మండలంలోని మన్ననూరు ప్రాథమికోన్నత పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠాలు చెప్పడమే కాదు.. విద్యార్థులతో చదివించి వారి సామర్థ్యాన్ని పరిక్షించారు.

కొంత మంది విద్యార్థులు అక్షరాలను చదవంలో తడబడ్డారు. దీంతో కలెక్టర్ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడి ఉన్న వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా పరిశీలించారు కలెక్టర్. తమ పాఠశాలలో గదుల కొరత ఉందని ఉపాధ్యాయులు కలెక్టర్ శ్వేతా మహంతి దృష్టికి తీసుకుపోయారు. 

ఇదిలా ఉంటే గతంలోనూ కలెక్టర్ శ్వేతా మహంతా ిజల్లాలో పాఠశాలల తనిఖీ సందర్భంగా చిన్నారులకు పాఠాలు చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అప్పటి ఫొటోను కింద చూడొచ్చు.