మరో అవార్డు అందుకున్న కలెక్టర్ ఆమ్రపాలి

Collector amrapali gets another award
Highlights

ఆమ్రపాలి ఖాతాలో మరో అవార్డు చేరింది

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరో అవార్డు అందుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు వచ్చిన అవార్డు ఇది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు హడ్కో అవార్డు దక్కింది. ఆ అవార్డును కలెక్టర్ ఆమ్రపాలికి అందజేశారు.

దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) తమ 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ర్టానికి మూడు అవార్డులు దక్కాయి.

డిజైన్ విభాగంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి, బెస్ట్ ప్రాక్టీసింగ్ విభాగంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్, గ్రీన్ బిల్డింగ్స్ విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు అవార్డులు దక్కాయి. అవార్డును అందుకున్న కలెక్టర్ ఆమ్రపాలి హర్షం వ్యక్తం చేశారు.

loader