తన వివాహం కారణంగా ఇంతకాలం సెలవులో ఉన్నారు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి. అయితే ఆమె పెళ్లి వేడుకలు జరుపుకుని ఈనెల 9వ తేదీన విధుల్లో చేరారు. విధుల్లో చేరిన వెంటనే ఆమ్రపాలికి రిలాక్స్ అయ్యే వార్త అందింది. అదేంటో చదవండి.

ఈనెల 9వ తేదీన ఆమ్రపాలి విధుల్లో చేరారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రివ్యూ సమావేశం జరిగింది. అయితే ఆమ్రపాలి ఆ సమావేశానికి హాజరు కాలేదు. కానీ శనివారం జరిగిన జరిగిన వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆమ్రపాలి పాల్గొన్నారు. అంతేకాదు ఆమె జాయిన్ అయినప్పటి నుంచీ ప్రభుత్వ పథకాల అమలులో నిమగ్నమయ్యారు.  

ఆమ్రపాలి రిలాక్స్ అయిన వార్త ఏమంటే ఆమె పెళ్లికి వెళ్లకముందు ఆమెకు వరంగల్ అర్బన్ కలెక్టర్ బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ ఆమె పెళ్లి నుంచి వచ్చిన తర్వాత వరంగల్ రూరల్ కలెక్టర్ గా ఎం.హరిత నియమితులయ్యారు. హరిత గ్రూప్1 అధికారిగా ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. అయితే ఈ జనవరిలో ఆమెకు ఐఎఎస్ గా ప్రమోషన్ ఇచ్చింది తెలంగాణ సర్కారు. కొంతకాలం ఐఎఎస్ అధికారిగా ప్రమోషన్ పొందినా.. కొంతకాలం జెసి హోదాలోనే హరిత కొనసాగారు. గత వారంలో ఆమెను ప్రభుత్వం వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా నియమించింది. ఈనెల 12న ఆమె అర్బన్ జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరారు.

ఎం హరిత విధుల్లో చేరడంతో ఇప్పుడు ఆమ్రపాలికి అర్బన్ బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. ఇక అర్బన్ లో పాలన వేగవంతం చేసేందుకు ఆమ్రపాలి కసరత్తు చేస్తున్నారు. శనివారం కుడా రివ్యూ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం తో పాటు ఆమ్రపాలి పాల్గొన్నారు. అలాగే..దివ్యాంగుల వసతి గృహానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వన్ స్టాప్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమ్రపాలి మాట్లాడారు. ఈ కేంద్రంలో మహిళలకు భద్రత కల్పించేందుకు ఇక్కడ 15 మంది శిక్షితులైన్ మహిళలు ఉన్నారని, దాడులు, హింస, వేధింపులు ఎలాంటివి ఎదురైనా ఇక్కడకు వస్తే వారికి అన్ని విధాలా సహకారం అందుతుంది అన్నారు.

కలెక్టర్ ఆమ్రపాలి విధుల్లో చేరడంతో ఇంకాలం ఆమె రాకకోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.