ప్రజలు ఛీ కొట్టినా బీఆర్ఎస్‌లో మార్పేది .. ఈసారి ప్రతిపక్షంలో కూడా వుండనివ్వరు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని.. కానీ ప్రగతి భవన్‌ ముందున్న ఇనుప కంచెలు బద్ధలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేద రైతులకు క్వింటాల్‌కు రూ.1960 ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఫాంహౌస్‌లో పండిన పంటకు రూ.4250 ఇచ్చారని దానిపై విచారణకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు.

cm revanth reddy serious comments on brs mlas in telangana assembly ksp

బీఆర్ఎస్‌లో డిప్యూటీ సీఎంలుగా , మంత్రులుగా పనిచేసిన వారు ఏమయ్యారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో శనివారం చర్చ జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ..  ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బీఆర్ఎస్‌లో మార్పు రాలేదని ఆయన దుయ్యబట్టారు. ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర మీదని సీఎం దుయ్యబట్టారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని.. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. కానీ ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మా పార్టీ.. మా ఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదని సీఎం పేర్కొన్నారు. ఈ సారి ప్రతిపక్షంలోకి కాదు.. బయటకు పంపిస్తారని ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు. 

ప్రగతి భవన్‌కు ప్రవేశం లేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన విలక్షణ తీర్పు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పని ఆయన పేర్కొన్నారు. గడీలు బద్ధలు కొట్టి ప్రజావాణికి జనం క్యూ కడుతుంటే బీఆర్ఎస్ నేతలు భరించలేకపోతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారు అక్కడ కూర్చొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మాది ప్రజా ప్రభుత్వమని, ప్రజల తీర్పును గౌరవించాలన్న ఆలోచన విపక్షానికి లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు పాల్గొనలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్‌లోకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని.. కానీ ప్రగతి భవన్‌ ముందున్న ఇనుప కంచెలు బద్ధలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో రెండు నెరవేర్చామని ఆయన పేర్కొన్నారు. ప్రగతి భవన్ ముందు గద్ధర్ గంటల తరబడి నిరీక్షించినా లోనికి అనుమతించలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. పదేళ్లలో ఒక్క అమరవీరుడి కుటుంబాన్నైనా ప్రగతి భవన్‌లోకి రానిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ప్రజలకిచ్చిన మిగిలిన హామీలను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయించినవారికి కండువా మార్చగానే పదవులు ఇచ్చారని సీఎం దుయ్యబట్టారు. 

తెలంగాణ ప్రజలు అన్నీ గమనించారని.. గతంలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సంపత్ కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేశారని ఆయన ఫైర్ అయ్యారు. హామీల అమలు, చట్టబద్ధత కల్పించడం ఈ సభ ద్వారా చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి పదవులు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. ధర్నా చౌక్‌ను పునరుద్ధరించి స్వేచ్ఛను కల్పించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.  రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో వుందని ఆయన పేర్కొన్నారు. రైతు చనిపోతే తప్పించి బతకడానికి హామీ ఇవ్వలేదన్నారు. రైతుల చావులను ప్రోత్సహించి బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నరేళ్లలో ఏనాడు పిలిచి భరోసా ఇవ్వలేదు, భోజనం పెట్టలేదని సీఎం ఎద్దేవా చేశారు. ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌక్‌ను తొలగించి నిర్బంధ పాలన చేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రైతుల పంటలకు , రైతుల జీవితాలకు బీమా వుండాలని సీఎం తెలిపారు. పంట బీమా పథకాన్ని పెట్టి వుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల చావుకు రూ.5 లక్షల వెలకట్టారని సీఎం విమర్శించారు. రైతుల వరి పంటను కొనలేదని, బతికున్నప్పుడు భరోసా ఇవ్వకుండా రైతు చనిపోయినప్పుడు వెల కట్టారని ఆయన మండిపడ్డారు. 

ఉద్యమంలో నమోదైన కేసులపై ఎప్పుడైనా సమీక్షించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేద రైతులకు క్వింటాల్‌కు రూ.1960 ఇవ్వలేదు కానీ కేసీఆర్ ఫాంహౌస్‌లో పండిన పంటకు రూ.4250 ఇచ్చారని దానిపై విచారణకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. ఈ కుటుంబంలోవున్న కొడుకు, అల్లుడు, కూతురికి పదవులు ఇచ్చారని.. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ తన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ మాజీ సీఎం కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు వున్నాయని ఆయన తెలిపారు. ప్రైవేట్ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఫాంహౌస్‌లో వడ్లు మద్ధతు ధరకు కొనిపించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదని.. అబద్ధపు పునాదుల మీద ఎదిగిన పార్టీ బీఆర్ఎస్ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కేసీఆర్ నిజంగా నీళ్లిచ్చి వుంటే పంపు సెట్ల సంఖ్య ఎందుకు పెరిగిందని సీఎం ప్రశ్నించారు. 29 లక్షల పంపు సెట్ల వినియోగం పెరిగిందని.. రైతులను దోపిడీ చేస్తున్న దళారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రాణహిత-చేవెళ్ల ఎందుకు ఎండిపోయిందని ఆయన ప్రశ్నించారు. రైతుబీమా కింద లక్షా 21 వేల మందికి పరిహారం అందించారని, కాలువలతో రైతులకు నీళ్లు ఇచ్చి వుంటే 29 లక్షల పంపు సెట్లు ఎలా పెరిగాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

పాలమూరులో ఊరు.. పార్లమెంట్‌లో నోరు లేకపోయినా కేసీఆర్‌ను గెలిపించామని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు . తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ పదవ స్థానంలో వుందని సీఎం తెలిపారు. వరి వేస్తే భేష్ అన్నారు.. ఆ తర్వాత వరి వేస్తే ఉరే అన్నారని రేవంత్ ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాకు కేసీఆర్ చేసింది ఏంటని ఆయన ప్రశ్నించారు. ముంపు బాధితులకు ఇళ్లు కట్టించి వుంటే కేసీఆర్‌కు ఎంతో గౌరవంగా వుండేదని రేవంత్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో ప్రాజెక్ట్‌లేవీ పూర్తి కాలేదని ఆయన పేర్కొన్నారు. ఇసుక దోపిడీలో బీఆర్ఎస్‌కు వాటా లేదా అని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

కేసీఆర్ కుటుంబీకులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తలసరి విద్యుత్ వినియోగంపై ఇన్ని రోజులు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. ఇంతమంది రైతులు చనిపోతే రైతు రాజ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులను బయటికి పంపించొద్దని, వాళ్లు వినాలి , వాళ్లకు ఇదే శిక్ష అని రేవంత్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. కృష్ణా, గోదావరి జలాల్లో వివక్షకు బీఆర్ఎస్ కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. నేరెళ్లలో ఇసుక దోపిడీపై నిరసన తెలిపిన దళితులను అణచివేయలేదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios