Asianet News TeluguAsianet News Telugu

CM Revanth Reddy: "అసలు తగ్గేదేలే.. త్వరలో ఆ స్కాంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ .."

CM Revanth Reddy:కాళేశ్వరం కుంభకోణంపై త్వరలో జ్యుడీషియల్ విచారణ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తుల నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు
 

CM Revanth Reddy says Judicial probe into Kaleshwaram scam will start soon KRJ
Author
First Published Feb 24, 2024, 12:12 AM IST

CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నష్టాలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తుల నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించి దోషులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.  సమ్మక్క సారలమ్మ (మేడారం) జాతరలో పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాళేశ్వరం కుంభకోణంపై న్యాయ విచారణ చేపడుతామన్నారు. ఈ విషయంపై  విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పుడు.. ఈ అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసినందుకు బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ అడ్డుకోలేదని రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నా..గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పైనా గానీ,  ఆయన కుటుంబ సభ్యులపైనా ఒక్క కేసు గానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ గానీ ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. మరీ కేసీఆర్  అవినీతిపై సీబీఐ, ఐటీ, ఈడీ ఎందుకు స్పందించలేదనీ,  కోర్టుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదనీ కేంద్ర ప్రభుత్వానికి నిలదీశారు. తాము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా.. బీజేపీ నాయకులు అందుకు అడ్డుపడుతున్నారనీ, ఎందుకంటే వారు కేసీఆర్ కుటుంబంతో  ఒప్పందం కుదుర్చుకుని డబ్బు సంపాదించారని ఆరోపించారు. 

ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల పంట రుణాల మాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం బ్యాంకులతో చర్చలు జరుపుతోందని, రైతులకు త్వరలోనే శుభవార్త చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు, 6,956 స్టాఫ్ నర్సులు, 441 సింగరేణి ఉద్యోగులను ప్రభుత్వం భర్తీ చేసిందని, 15 వేల పోలీసు, అగ్నిమాపక శాఖల ఖాళీలను భర్తీ చేసిందన్నారు.

మరో 6 వేల మంది అభ్యర్థులకు మార్చి 2న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఉద్యోగ నియామకాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేసిన చంద్రశేఖర్‌రావు, కెటి రామారావు, టి.హరీష్‌రావులపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 10 స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రతిరోజూ చర్చలు జరుపుతున్నాయని ఆరోపించారు. బీజేపీ 10 లోక్‌సభ స్థానాల్లో, బీఆర్‌ఎస్‌ ఏడు స్థానాల్లో పోటీ చేసేలా ఏర్పాట్లు చేశామని సీఎం రేవంత్  పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మల ఆశీస్సులతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యానికి నాంది పలికిందన్నారు. మేడారం జాతరకు వచ్చే 1.5 కోట్ల మంది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది.

'దక్షిణ కుంభమేళా' అని పిలిచే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి  కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచన మేరకు దీన్ని తిరస్కరించారని ఆరోపించారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆయన, ఉత్సవాలకు మేడారం రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios