Asianet News TeluguAsianet News Telugu

Rythu Bandhu: ఖాతాలో డబ్బులు పడ్డాయా?.. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

రైతు బంధు నిధులను వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో చెల్లించినట్టుగానే ఈ సారి కూడా చెల్లించాని చెప్పారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతు భరోసాగా విడుదల చేయాలని తెలిపారు.
 

cm revanth reddy orders officials to release funds under rythu bharosa scheme to farmers immediately kms
Author
First Published Dec 11, 2023, 10:11 PM IST

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పినట్టయింది. రైతు భరోసా నిధులను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలని, చెల్లింపులు ప్రారంభించాలని ఆదేశించారు. గతంలో ఎలాగైతే చెల్లింపులు జరిపారో.. అదే రీతిలో ఇప్పుడూ చెల్లించాలని చెప్పారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను రైతు భరోసా కోసం విడుదల చేయాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా వారమైనా గడవలేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి యమా స్పీడ్‌ మీద ఉన్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్లుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో రైతు భరోసా పథకాన్నిప్రకటించింది. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అమలు చేయాలని భావించింది. ఇంకా రైతు భరోసా విధివిధానాలు ఖరారు కావాల్సి ఉన్నది. కానీ, రైతులకు ఆలస్యం అవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో రైతు బంధు పథకం లబ్దిదారులకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ పైనా కార్యచరణ, ప్లానింగ్‌ను రూపొందించాల్సి ఉన్నది. ఈ కార్యచరణ, ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Janardhan Reddy: TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా.. గవర్నర్ ఆమోదం

రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదల కావల్సింది. కానీ, ఎన్నికల కోడ్ రావడంతో రైతు బంధు నిధుల పంపిణీ కాలేదు. ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినా.. ఆ తర్వాత కోడ్ ఉల్లంఘన జరిగిందని నిలిపేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios