Asianet News TeluguAsianet News Telugu

త్వరలో తెలంగాణలో కులగణన .. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. 

cm revanth reddy key orders to officials for caste census in telangana ksp
Author
First Published Jan 27, 2024, 5:55 PM IST | Last Updated Jan 27, 2024, 6:07 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కులగణన చేపడుతామని ఆ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  

ఇకపోతే.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా అక్కడి సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కులగణనకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో కోటీ 60 లక్షల కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులగణన చేయనుంది. రాష్ట్రంలో వున్న మొత్తం 723 కులాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా విభజించనున్నారు. జనవరి 19న ప్రారంభమైన ఈ సర్వే 28 వరకు జరగనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios