బీజేపీ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలపై అసెంబ్లీలో చర్చిస్తారా?: సీఎం రేవంత్ రెడ్డి సవాల్

బీజేపీ, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలపై అసెంబ్లీలో చర్చించే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు హామీలపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
 

cm revanth reddy challenges brs, bjp asking manifestos discussion in assembly kms

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014, 2018లలో బీఆర్ఎస్, బీజేపీల మ్యానిఫెస్టోలను ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించే దమ్ముందా? అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ... బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజా ప్రయోజనాల కోసం ఇప్పటి వరకు తమ ప్రభుత్వాన్ని కలువలేదని అన్నారు. ‘మేం చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాం. కేంద్ర ప్రభుత్వ నాయకులను కలిశాం. మరి మీరెందుకు మాతో సహకరించడం లేదు? అలాంటప్పుడు ప్రధానమంత్రిగా మోడీని మూడో సారి ఎందుకు చేయాలి? రైతులను చంపడానికి చేయాలా? అని ప్రశ్నించారు.

అసలు కేసీఆర్‌కు మోడీకి మధ్య తేడా ఏమున్నదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వీరిద్దరూ తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ కూడా బీఆర్ఎస్ భాషనే మాట్లాడుతున్నదని పేర్కొన్నారు. హరీశ్ రావు, కిషన్ రెడ్డిలు ఇద్దరూ ఒకే భాష మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఒక్క కేసీఆర్ కుటుంబం తప్పితే బీఆర్ఎస్ నేతలు ఎవరికీ ఆ పార్టీ లైన్‌ను అంగీకరించరని వివరించారు. 

Also Read: BRS: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి

కేసీఆర్ తెలంగాణను వేగంగా నాశనం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో ఆయన వందేళ్ల నష్టం చేశారని తెలిపారు. అప్పలు కోసం ఇప్పుడు ప్రతి యేటా రూ. 70 వేల కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నదని వివరించారు. 2014లో రూ.  6 వేల కోట్లు మాత్రమే అప్పు చెల్లించాల్సి ఉండేదని, ఇప్పుడు భారీగా చెల్లించాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దివాళా తీశారని ఆరోపించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios