చర్చకు సిద్దమా..?: బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ సవాల్..

CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ఆరు హామీలకు విరుద్ధంగా 2014, 2018 మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమా అని కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సవాల్ విసిరారు. 

CM Revanth Reddy challenges BJP, BRS to discuss manifestos KRJ

CM Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ కి ప్రశ్నించే అర్హత లేదన్నారు. కేంద్రం పదేళ్లుగా అధికారంలో మోడీ సర్కార్ తెలంగాణకు  ఏం ఇచ్చారని నిలదీశారు. గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చర్చించడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు సిద్దమా అని, మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ముఖ్యమంత్రి..  కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి ప్రజల సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడూ కలవలేదన్నారు. సమస్యలపై కేంద్రానికి చాలాసార్లు వెళ్లి నేతలను కలిశాం. మీరు ఎందుకు సహకరించడం లేదు? మోడీని మూడోసారి ఎందుకు ప్రధానిని చేయాలి? ప్రశ్నించారు.  

తెలంగాణను మోసం చేసిన కేసీఆర్‌కు, మోదీకి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ మాట్లాడే భాషనే బీజేపీ మాట్లాడుతోంది. హరీశ్‌రావు, కిషన్‌రెడ్డి ఒకే భాష మాట్లాడుతున్నారని అన్నారు. మోడీ ఇచ్చిన హామీలు, స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం తీసుకొచ్చే అంశం.. రైతులకు హామీలు, రెండు కోట్ల ఉద్యోగాలు, మోడీ 2014, 2019 ఎన్నికల హామీలపై చర్చిద్దామా అంటూ కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డికి  సవాల్ విసిరారు.  

మరో వైపు.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ.. ఆయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసారనీ, గత 10 సంవత్సరాలలో ఆయన  100 సంవత్సరాలు తేరుకొని విధ్వంసం చేశారని అన్నారు. అలాగే.. కాళేశ్వరం పేరిట వేలకోట్లు దండుకున్నారని ఆరోపించారు. మేడిగడ్డను ఎలా చక్కదిద్దుతారో హరీశ్‌రావు చెప్పాలని, ఆయన చేసిన పనిని కేసీఆర్‌ సందర్శించాలని ఆయన అన్నారు.  

తమ ప్రభుత్వం 70 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.  ఉద్యోగానికి సంబంధించిన చిన్న సమస్యలను, కోర్టు సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌, రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ కోసం దరఖాస్తులను తిరిగి తీసుకుంటామనీ, ప్రజలు వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.  స్కీమ్‌ల ఆంక్షలు విధించకపోతే, జూబ్లీహిల్స్‌లోని ప్రజలు కూడా ఉచిత విద్యుత్ మరియు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించాలనుకుంటున్నారని అన్నారు.

వ్యవసాయ రంగాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని రకాల పంటలు కనుమరుగయ్యాయని, ఇప్పుడు కేవలం వరి మాత్రమే పండుతుందని అన్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలే భూగర్భ జలాలు పెరగడానికి కారణమన్నారు. కెటిఆర్‌ను టార్గెట్ చేస్తూ..  అతను మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన అవుట్‌సోర్సింగ్ వ్యక్తి అని అన్నారు. ఎన్నికలకు తనే నాయకత్వం వహించానని, సీఎం అభ్యర్థిపై సందేహం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇలా మాజీ సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డికి ఏమీ తేడా లేదన్నారు. ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేశారనీ, పీకల్లోతు కష్టాల్లోకి నెట్టివేశారని  ఆరోపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios