CM Revanth Reddy: అన్ని లెక్కలూ ఇవ్వండి.. మేడిగడ్డ బ్యారేజీపై శ్వేత పత్రం విడుదలకు కసరత్తు.. 

CM Revanth Reddy: కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతోపాటు శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించినట్లు తెలుస్తోంది.
 

CM Revanth Reddy asks officials to submit all details on Medigadda and other irrigation projects KRJ

కేసీఆర్ సర్కార్ వేల కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన ఇతర ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తొలుత మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ కుంగిపోవడం, దాని పునర్నిర్మాణంపై వివాదం చేలారేగడంతో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యారేజీ కుంగుబాటు, నిర్మాణ అంశాలు, డిజైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ సర్కార్ అవలంబించిన విధానాలు, ఆర్థిక వ్యవహారాలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి.. శ్వేతపత్రం విడుదల చేయాలనే యోచనలో రేవంత్ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. 

మేడిగడ్డ బ్యారేజీ తో పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మొత్తం నీటి పారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షసమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత నీటిపారుదల రంగంపై సీఎం రేవంత్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే..  ఇతర రాష్ట్రాలతో ఉన్న జల వివాదాలు,  కృష్ణా ట్రైబ్యునల్‌ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో అంతర్రాష్ట్ర జలవివాదాలను కూడా త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. 

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలను వీలైనంత త్వరగా తనకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అదే విధంగా యాసంగి పంటలకు నీటి లభ్యత, ఇతర అంశాలపైనా పలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అంతకుముందు.. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంతో పాటు రెండో పంటకు సాగునీరు ఇచ్చే విషయంతో పాటు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటితో ఎన్ని ఎకరాలకు అందించగలమనే వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఈఎన్‌సీ మురళీధర్‌, అధికారులు పాల్గొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios