పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవితకు ఒక ఆఫర్ ఇచ్చారు. కానీ.. మమత ఇచ్చిన ఆఫర్ ను ఎంపి కవిత సున్నితంగా తిసర్కరించారు. ఇంతకూ మమత ఇచ్చిన ఆఫర్ ఏమిటి? కవిత ఎందుకు తిరస్కరించారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సిఎం కేసిఆర్ తో పాటు పశ్చిమబెంగాల్ టూర్ కు వెళ్లారు ఎంపి కవిత. అక్కడ మమతా బెనర్జీతో కలిసి ఫొటోలు దిగారు కవిత. అలాగే ఇద్దరు సిఎంలు కేసిఆర్, మమత మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకున్నారామె. అయితే ఈ సందర్భంగా కవితను ఒకరోజు కలకత్తాలోనే ఉండాలంటూ సిఎం మమత కోరారు. కానీ అందుకు కవిత సున్నితంగా తిరస్కరించి సిఎం కేసిఆర్ తో పాటే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నందున కలకత్తాలో ఉండేందుకు సమయం లేదని కవిత పేర్కొన్నారు.

ఈ పర్యటనలో ఎంపి కవిత చార్మినార్ జ్ఞాపికను సిఎం మమతకు బహుకరించారు. అలాగే పోచంపల్లి పట్టు చీరను మమతకు బహుకరించారు.

కేసిఆర్ బృందం కోల్ కత్తా చేరుకోగానే విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ కు చేరుకున్నారు. హోటల్ లో రిలాక్స్ అయిన తర్వాత మధ్యాహ్నం సచివాలయం వచ్చి మమత తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత ప్రయాణించే కారు ఆలస్యమవడంతో ఆమె రాక కోసం సచివాలయంలో మమత ఎదురుచూశారు.

రాజకీయంగా కేసిఆర్ ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్ కు మమత ఏమేరకు సపోర్ట్ చేస్తారో కానీ.. తన ఇంటికి వచ్చిన అథిదులను మాత్రం ఆమె బాగానే గౌరవించిందని గులాబీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.