Asianet News TeluguAsianet News Telugu

ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై కేసీఆర్ అభ్యంతరం: మోడీకి లేఖ

ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం  చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

CM KCR writes letter to PM Narendra Modi
Author
Hyderabad, First Published Jan 24, 2022, 6:00 PM IST

హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ రూల్స్  సవరణపై ప్రధానమంత్రి Narendra Modiకి తెలంగాణ సీఎం KCR సోమవారం నాడు లేఖ రాశారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణను వ్యతిరేకిస్తున్నట్టుగా ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు. ఈ సవరణలు ఫెడరల్ స్పూర్తికి విరుద్దంగా ఉన్నాయన్నారు.

రాష్ట్రాల్లో పనిచేసే అధికారులను కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడ వేసిందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.ఈ సవరణలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేసీఆర్ చెప్పారు..ఆలిండియా సర్వీస్ రూల్స్ సవరణ రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనన్నారు. వీటిపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిఃస్తోందని కేసీఆర్ విమర్శించారు. ఈ రూల్స్ సవరణలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో కేంద్రం వేలు పెట్టినట్టుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడడ్డారు.

ఆలిండియా సర్వీసెస్ యాక్ట్ 1951 రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 ప్రకారం పార్లమెంట్ చట్టం చేసిన విషయాన్ని ఆయన ఆ లేఖలో గుర్తు చేశారు. ఈ చట్టం ఆధారంగానే కేంద్రం పలు రూల్స్ ను ప్రవేశ పెట్టిందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న సవరణలు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను కాలరాయడమేనన్నారు. ఇలా ఏకపక్షంగా మొండిగా ఆలిండియా సర్వీసెస్ తో కేంద్రం సవరణలు చేయడం కన్నా పార్లమెంట్ ఆమోదంతో సవరణలు చేసే దమ్ము కేంద్రానికి ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఈ రూల్స్ సవరణల ద్వారా  రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ IAS అధికారినైనా డిప్యూటేషన్ పై కేంద్రం తీసుకోవచ్చు. ఈ సవరణలపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు  వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి Mamata banerjee, తమిళనాడు సీఎం Stalin, కేరళ ముఖ్యమంత్రి Pinarayi Vijayan ఈ విషయమై ప్రధాని మోడీకి లేఖలు రాశారు. ఇవాళ కేసీఆర్ లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios