Asianet News TeluguAsianet News Telugu

CM KCR: రేపే ఆ రెండు చోట్ల సీఎం కేసీఆర్ నామినేషన్.. 

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.  రేపు సీఎం కేసీఆర్ తోపాటు కీలక నాయకులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

CM KCR will file nominations as BRS candidate from Gajwel, Kamareddy Assembly Constituencies KRJ
Author
First Published Nov 8, 2023, 9:44 PM IST

CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంది. నామినేషన్ గడువు సమీపిస్తున్న కొద్ది ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖాలు చేయడానికి సమయత్నం అవుతున్నారు.  ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలుకు చేయడానికి ముహూర్తం ఖరారు అయ్యింది. రేపు (నవంబర్ 9) గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 

ఒకే రోజు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా, కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. తొలుత ఉదయం 11 గంటల ప్రాంతంతో గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి హెలికాప్టర్‌లో వెళ్లి అక్కడ నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

హరీశ్ రావు కూడా రేపే

మంత్రి హరీశ్ రావు కూడా రేపు (నవంబర్ 9) గురువారం నాడు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios