ఈసారి జరగనునన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయబోయే స్థానంపై సస్పెన్స్ వీడింది. ఆయన గజ్వేల్ , కామారెడ్డి రెండు చోట్లా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈసారి జరగనునన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయబోయే స్థానంపై సస్పెన్స్ వీడింది. గత రెండు పర్యాయాలుగా ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వచ్చారు. అయితే ఈసారి వ్యూహం మార్చి రెండు చోట్లా పోటీ చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే గజ్వేల్, కామారెడ్డిల నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. నేతల విజ్ఞప్తి మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. 

అలాగే అక్టోబర్ 16న వరంగల్ భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజున మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని సీఎం తెలిపారు. పరిస్ధితులను బట్టి అభ్యర్ధులును మారుస్తామని.. ఈ విధంగానే ఏడు చోట్ల మార్పులు జరిగాయని కేసీఆర్ వెల్లడించారు. నాలుగు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి వుందని సీఎం పేర్కొన్నారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు.