స్పీకర్ పై సిఎం కేసిఆర్ సెటైర్

స్పీకర్ పై సిఎం కేసిఆర్ సెటైర్

తెలంగాణ అసెంబ్లీ  స్పీకర్ మధుసూదనాచారి తొనకకుండా నిండు కుండలా ఉంటారు. ఆయనకు, సిఎం కేసిఆర్ కు మధ్య ఇటీవల ఒక ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. స్పీకర్ తన బరువు గురించి చెప్పగా దానికి సిఎం సరదా సెటైర్ వేశారు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ వివరాలు చదవండి.

బిసి ప్రజాప్రతినిధులతో అసెంబ్లీలోని కమిటీ హాలులో సమావేశం జరిగింది. దీనికి శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్నతోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, బిసి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశం తొలిరోజు సిఎం కేసిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి షెషన్ అయిపోయింది. అందరూ మధ్యాహ్న భోజనానికి కూర్చున్నారు.

ఈ సందర్భంగా సిఎం, స్పీకర్, ముఖ్యనేతలంతా పక్క పక్కనే కూర్చని భోజనం చేశారు. ఆ సమయంలో ఇంకా వడ్డించుకో అని స్పీకర్ ను ఉద్దేశించి సిఎం అన్నారు. అప్పుడు స్పీకర్ నా బరువు 115 కిలోలకు చేరింది.. తగ్గించాలి.. అందుకే తక్కువ తింటున్నాను అన్నారు. దీనికి సిఎం స్పందిస్తూ... అంత బరువు మంచిదికాదు వెంటనే తగ్గాలి.. ఆ బరువు ఉంటే నిమ్స్ హాస్పటల్ చుట్టూ తిరగాల్సి వస్తది అంటూ చమత్కరించారు. దీంతో వారిద్దరూ నవ్వుకున్నారు. 

మొత్తానికి ఈ సరదా సంభాషణ అటు ఇటు తిరుగుతూ ప్రజాప్రతినిధుల ద్వారా బయటకు లీక్ అయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos