తెలంగాణ మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనగోలుపై కేంద్రం వైఖరిని ఈ భేటీలో చర్చించనున్నారు. 

తెలంగాణ మంత్రివర్గం రేపు అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనగోలుపై కేంద్రం వైఖరిని ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రంలో పండించిన యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్.. కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు. 

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో టీఆర్‌ఎస్ నిర్వహించిన నిరసన దీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ.. 24 గంటలలోపు ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పారు. రైతు సమస్యలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఎవరితోనైనా గొడవ పడొచ్చని.. కానీ రైతులతో పడొద్దని అన్నారు. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టిస్తే ఆ పాపం ఉరికేపోదని అన్నారు. తెలంగాణ రైతులు చేసిన పాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని అన్నారు. తెలంగాణ ఓట్లు, సీట్లు కావాలి కానీ.. ధాన్యం వద్దా అని బీజేపీని ప్రశ్నించారు.