Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పథకాలు కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.. ఇప్పుడు ఏపీలోనే కరెంట్ ఉండటం లేదు.. కేసీఆర్

టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్ది మంది మిత్రులతో తెలంగాణ ఉద్యమ ప్రస్తానం ప్రారంభమైందని ప్లీనరీలో మాట్లాడుతూ కేసీఆర్ గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. 

CM KCR Speech At TRS Plenary Meeting updates
Author
Hyderabad, First Published Oct 25, 2021, 12:14 PM IST

కొద్ది మంది మిత్రులతో తెలంగాణ ఉద్యమ ప్రస్తానం ప్రారంభమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) గుర్తుచేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆనాడు దేశ స్వాతంత్ర్య పోరాటం ఆగలేదన్నారు. స్వాతంత్ర్య పోరాటం తరహాలోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. ఇక, తనను పార్టీ అధ్యక్షుడిగా మరోమారు ఏకగ్రీవంగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.  ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశానని చెప్పారు. అహింస మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త భాష్యం చెప్పిందన్నారు. తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించాం. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగిరిందని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. 

Also Read: TRS Plenary: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణపై దుష్ప్రచారం చేశారు.. 
తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని దుష్ప్రచారం చేశారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని అన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. అయితే ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశాం. ఎఫ్‌సీఐ కూడా మేం కొనలేమని చెప్పే స్థాయిలో వరి పండించాం. ఆర్థికాభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచాం. గతంలో పాలమూరు నుంచి ఉపాధి కోసం వలస వెళ్లేవారు. ఇప్పుడు ఉపాది కోసం పాలమూరుకే వస్తున్నారు. 

దళిత బంధు తర్వాత ఏపీ నుంచి వేలాది విజ్జాపనలు.. 
రైతు ఆత్మహత్యలతో నాడు తెలంగాణ కృశించిపోయింది. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పంతో ముందుకు సాగాం. భారతదేశాన్ని తట్టిలేపిన ఉద్యం.. Dalit Bandhu పథకం. దళిత బంధు ప్రకటించాక.. ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది విజ్జాపనలు వచ్చాయి. ఏపీలో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్జాపనలు వచ్చాయి. ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు వచ్చి తెలంగాణలో పనిచేసుకుంటున్నారు. తెలంగాణలో కలపాలని పొరుగు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల నుంచి డిమాండ్లు వచ్చాయి. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి డిమాండ్లు వచ్చాయి. 

Also Raed: TRS Plenary: మీరెందుకు గులాబీ చొక్కాలు వేసుకోలేదు?.. కొందరు నేతలతో కేటీఆర్

ఇప్పుడు ఏపీలోనే కరెంట్ లేదు..
మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ. 1.70 లక్షలు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2.35 లక్షలకు పెరిగింది. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కొందరు ఏపీ నేతలు అన్నారు. ఇప్పుడు ఏపీలోనే కరెంట్ ఉండటం లేదు. 

దళిత బంధుతోనే ఆగిపోం..
అట్టడగున ఉన్నందునే మొదటగా దళితుల కోసం Dalit Bandhu తీసుకొచ్చాం. కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేశారా..?. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదు. దళిత బంధు పెట్టే పెట్టుబడి వృథా కాదు. దళిత బంధుతో ఆగిపోకుండా మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పాటు ఇస్తోంది. దళిత వర్గాలకే కాకుండా మిగతా వర్గాలకు కూడా చేయగల శక్తి, యుక్తి ఒక్క టీఆర్‌ఎస్‌కే ఉన్నాయి. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ. 425 కోట్లు
టీఆర్ఎస్ ఆర్థిక‌ప‌రంగా కూడా శ‌క్తివ‌తంగా త‌యారైంది. టీఆర్ఎస్‌కు కూడా విరాళాలు స‌మ‌కూరాయి. రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఉన్నాయి. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన విరాళాల ద్వారా పార్టీ కార్య‌కలాపాలు కొన‌సాగుతున్నాయి. వాటి మీద నెలకు రూ. 2 కోట్ల ఆదాయం. 31 జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మాణాలు జరిగాయి.. ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. మలిదశలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా పార్టీ కార్యాలయాన్ని ఏర్పటు చేసుకోబోతున్నాం. ఈ మధ్యనే కేంద్రంచే జాగ కేటాయించుకుని.. అక్కడ పార్టీ కార్యాలయం శంకుస్థాపన జరుపుకున్నాం. తలకుమాసిన వెధవలు, అడ్డం పొడువు మాట్లాడితే టీఆర్‌ఎస్ పార్టీ అదిరిపోదు. ఆర్థికంగా బలమైన పార్టీ. 

నవంబర్, డిసెంబర్‌లలో యుద్ద ప్రతిపాదికన హుజురాబాద్‌లో దళిత బంధు..
ఒక ముఖ్యమంత్రిగా, భారతదేశంలో సీనియర్ నేతగా భారత ఎన్నికల సంఘానికి సలహా ఇస్తున్నాను. చిల్లర పనులు మానుకోవాలి. హుజురాబాద్ దళిత బిడ్డలు అదృష్టవంతులు. ఇక్కడ పైలెట్ ప్రాజెక్టును ఎవరూ ఆపలేరు. నవంబర్, డిసెంబర్‌లలో యుద్ద ప్రతిపాదికన హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేస్తాం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios