ఆర్థిక సాయం, రెసిడెన్షియల్ స్కూళ్లు.. బీసీలపై కేసీఆర్ వరాల జల్లు

cm kcr special focus on bc welfare
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలపై వరాల జల్లు కురిపించారు. బీసీ కులాల సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఇవాళ ప్రగతి భవన్‌లో అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలపై వరాల జల్లు కురిపించారు. బీసీ కులాల సంక్షేమంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఇవాళ ప్రగతి భవన్‌లో అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్ధిక సాయం అందించాలన్నారు.. అలాగే వచ్చే ఏడాది నుంచి వెనుకబడిన విద్యార్ధుల కోసం మరో 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు మిగిలితే వాటిని బీసీలకే కేటాయిస్తామని.. ఈ కులాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని  సీఎం స్పష్టం చఏశారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం గ్రామాల వారీగా లబ్థిదారులను ఎంపిక చేయడానికి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా.. బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా.. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలని  ముఖ్యమంత్రి సూచించారు..

వీరందరికి బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థికసాయాన్ని అందించాలని..ఇందుకు అవసరమైన నిధులను బీసీ సంక్షేమ శాఖ, ఎంబీసీ కార్పోరేషన్‌కు కేటాయించిన మొత్తంలోంచి వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్,  స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
 

loader