తెలంగాణ చరిత్రపై భారత్ జాగృతి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

Hyderabad: తెలంగాణ చరిత్రపై భారత్ జాగృతి పుస్తకాన్ని ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) ఆవిష్కరించారు. చరిత్రకారుడు, రచయిత శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో తెలంగాణ ఘనమైన గతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేసి... ఈ పుస్త‌క సంపుటాల సిరీస్ ను  తీసుకువ‌చ్చారు. 
 

CM KCR releases Bharat Jagruti book on Telangana history  RMA

CM KCR unveils Bharat Jagruti book: 20 కోట్ల ఏళ్ల చరిత్రకు తెలంగాణ నిదర్శనమనీ, ఇది రాష్ట్రానికి, ఈ ప్రాంత‌ ప్రజలకు గర్వకారణమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ జాగృతి ఐదు సంపుటాలుగా వెలువరించిన తెలంగాణ చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర చరిత్రను ఆవిష్కరించడంలో చరిత్రకారులు చేసిన కృషిని అభినందించిన సీఎం.. తెలంగాణకు గొప్ప వారసత్వం ఉందనీ, దాని చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కోట్ల సంవత్సరాల నాటివని అన్నారు.

గత సామాజిక పరిస్థితులు, పరిపాలనా వ్యవస్థలను అర్థం చేసుకోవడం భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ జాగృతి చరిత్ర విభాగం గత ఆరేళ్లుగా తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించి అధ్యయనాలు కొన‌సాగిస్తోంది. చరిత్రకారుడు, రచయిత శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో తెలంగాణ ఘనమైన గతాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. క్షేత్రపరిశోధన ఫలితాలు, ఈ ప్రక్రియలో సేకరించిన సమాచారాన్ని మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో పుస్తకరూపంలో పొందుపరిచారు. 

ఆయా ప్రాంతాల్లో లభించిన శిలాజాలు, భవనాలు, శాసనాలు, నాణేలు, గ్రంథాలు సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను ఈ బృందం అధ్యయనం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. జాగృతి చరిత్ర విభాగం సిబ్బందిని, భారత్ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను ఈ సంద‌ర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్, కవి, సంపాదకుడు వేముగంటి మురళీకృష్ణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.రాజీవ్ సాగర్, భారత్ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగా నవీన్ ఆచారి పాల్గొన్నారు.

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios