Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్లు టైమిచ్చా.. ఇక ఏ అధికారిని ఉపేక్షించను, త్వరలోనే తనిఖీలకు వస్తున్నా: కేసీఆర్

త్వరలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను ఆయన తనిఖీ చేయనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదన్నారు. రెండేళ్లు గడిచాయని.. ఇక రంగంలోకి దిగక తప్పదని స్పష్టం చేశారు

cm kcr ready for surprise visit ksp
Author
Hyderabad, First Published Jun 11, 2021, 10:28 PM IST

త్వరలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనులను ఆయన తనిఖీ చేయనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదన్నారు. రెండేళ్లు గడిచాయని.. ఇక రంగంలోకి దిగక తప్పదని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదని.. త్వరలో అధికారుల పనితీరు పరిశీలిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

జూన్ 19 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపడతానని... పూర్తి సమయం ఇవ్వాలనే ఇన్ని రోజులు పర్యటన చేయలేదని సీఎం తెలిపారు. 13న అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీపీవోలతో సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని.. పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందని సీఎం పేర్కొన్నారు. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడత పల్లె, పట్టణ ప్రగతి పర్యటన నిర్వహిస్తామన్నారు.

Also Read:తెలంగాణ: అమల్లోకి పీఆర్‌సీ.. కనీస వేతనం రూ 19 వేలు, కనీస పింఛన్‌ రూ 9,500

పచ్చదనం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని.. ప్రతి నెల గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు కేటాయిస్తామని సీఎం వెల్లడించారు. అలాగే ప్రతి మున్సిపాటిటీ అభివృద్ధికి రూ.149 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios