ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో రెండు రోజుల పాటు భేటీ అయ్యారు. వీరి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై చర్చలు జరిగాయి. 

ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ (trs) అధినేత కేసీఆర్‌తో (kcr) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) భేటీ ముగిసింది. సీఎంతో శని, ఆదివారాలు రెండు రోజులు ఆయన రాష్ట్ర, దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై చర్చించినట్లుగా తెలుస్తోంది. 

త కొంత కాలంగా సీఎం కేసీఆర్, ప్ర‌శాంత్ కిషోర్‌కు మ‌ధ్య సానిహిత్యం పెరిగింది. ఇటీవ‌ల ఆయ‌న తెలంగాణ‌కు వ‌చ్చి తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ఒక అంచ‌నాకు వ‌చ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఆయ‌న వెంట అధికారులు, సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ (prakash raj) కూడా ఉన్నారు. అదే స‌మ‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో పీకేతో సానిహిత్యంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్ర‌శాంత్ కిషోర్ త‌న స్నేహితుడ‌ని, తాము చాలా కాలంగా క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని చెప్పారు. దీంతో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం పీకే టీఆర్ఎస్ కోసం ప‌నిచేస్తార‌ని స్పష్టం అయ్యింది. 

టీఆర్ఎస్ తో గ‌తంలోనే పీకే కు ఒప్పందం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలో తాజా ప‌రిస్థితుల‌పై స‌ర్వే నిర్వ‌హించి సీఎం కేసీఆర్ కు దానిని అంద‌జేశారు. అయితే ఆ స‌మ‌యంలో కేవలం 30 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన స‌ర్వే నిర్వ‌హిచారు. మిగిలిన 89 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటీవ‌లే స‌ర్వే నిర్వ‌హించారు. ఆ నివేదిక‌ను సీఎంకు అందించి ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డానికి సీఎం కేసీఆర్ తో శ‌నివారం స‌మావేశం అయ్యార‌ని అర్థం అవుతోంది. ఇందులో పీకే.. కాంగ్రెస్ అధిష్టానంతో చ‌ర్చ‌ల గురించి కూడా ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. అయితే తాను గ‌తంలో చేసుకున్న ఒప్పందం మేర‌కు తెలంగాణ‌లో టీఆర్ఎస్ తో క‌లిసి ప‌ని చేస్తాన‌ని స్పష్టం చేసిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. 

సీఎం కేసీఆర్, ప్ర‌శాంత్ కిషోర్ మ‌ధ్య ఆదివారం స‌మావేశం కూడా జ‌ర‌గ‌నుంది. ఇందులో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, ఇత‌ర రాజ‌కీయ‌ప‌ర‌మైన ముఖ్య అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. త్వ‌రలోనే టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ నెల 27వ తేదీన హైద‌రాబాద్ లో పార్టీ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్రశాంత్ కిషోర్ టీం స‌ర్వే, దాని నివేదిక, అలాగే టీఆర్ఎస్ పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి చేపట్టాల్సిన చ‌ర్య‌ల‌ను నేటి స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది.