ఢిల్లీ టూర్ పై చర్చేనా ?
తెలంగాణ సిఎం కేసిఆర్ గవర్నర్ నర్సింహ్మన్ తో భేటీ అయ్యారు. రాజ్ భవన్ వెళ్లిన సిఎం కేసిఆర్ సుమారు గంటపాటు నర్సింహ్మన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసిఆర్ ఢిల్లీ పర్యటన వివరాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్ల తెలిసింది. రాష్ట్రంలో ని ఇతర అంశాలపై చర్చించారు.
అలాగే జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు గవర్నర్ ను కేసిఆర్ ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఒకరోజులోనే ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన విషయమై గవర్నర్ తో చర్చించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
