రైతులందరికీ రైతు బంధు (rythu bandhu) అమలు చేస్తామని కేసీఆర్ (kcr) వెల్లడించారు. వరి వేస్తే రైతు బంధు ఆపాలని అధికారులు సూచించగా కేసీఆర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ  ప్రతిపాదనలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చర్చించారు. 

రైతులందరికీ రైతు బంధు (rythu bandhu) అమలు చేస్తామని కేసీఆర్ (kcr) వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో (telangana bhavan) శుక్రవారం జరుగుతున్న టీఆర్ఎస్ (trs) విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. నేతలు జనంలో వుండకుంటే ఎవరూ ఏం చేయలేరని సీఎం వ్యాఖ్యానించారు. దళిత బంధును ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆపేది లేదని కేసీఆర్ పేర్కొన్నారు. వరి వేస్తే రైతు బంధు ఆపాలని అధికారులు సూచించగా కేసీఆర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిపాదనలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చర్చించారు. 

ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో వుంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ధాన్యం విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని.. ఈ విషయాన్ని రైతులకు వివరించాలని కేసీఆర్ సూచించారు. వరికి ప్రత్యామ్నాయ పంటల వేయించాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు. వరి సేకరణ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని.. రైతులకు దీనిపై అర్ధమయ్యేలా వివరించాలని కేసీఆర్ పేర్కొన్నారు. 

Also Read:ప్రారంభమైన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం: వరి కొనుగోలు సహా కీలకాంశాలపై చర్చ

రైతు వేదికల దగ్గర సమావేశాలు నిర్వహించాలని.. పార్టీ కోసం కష్టపడేవారికే పదవులు దక్కుతాయని గులాబీ దళపతి తేల్చిచెప్పారు. దళిత బంధును అమలు చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్‌ల సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు. దళిత బంధు (dalitha bandhu ) లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకే అప్పగించారు సీఎం. 

ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు. కేంద్రం వైఖ‌రిని నిల‌దీస్తూ.. ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సీఎం పిలుపునిచ్చారు. నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్రం దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు. వ‌రికి బ‌దులుగా ఇత‌ర పంట‌లు వేయాల‌ని కేసీఆర్ రైతులకు సూచించారు. ఈ నెల 18న రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర మంత్రిని క‌ల‌వ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి వెల్ల‌డించారు