హైద్రాబాద్ లో మూడు ట్విమ్స్ ఆసుపత్రులకు  సీఎం కేసీఆర్ మంగళవారం నాడు భూమి పూజ నిర్వహించారు. సనత్ నగర్, కొత్తపేట, అల్వాల్ లో మూడు ట్విమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR మంగళశారం నాడు హైద్రాబాద్ లో మూడు TIMS ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారు. కొత్తపేట, సనత్ నగర్, అల్వాల్ లో మూడు టిమ్స్ ఆసుపత్రలను నిర్మించనున్నారు. అల్వాల్ లో 28.41 ఎకరాల్లో రూ. 897 కోట్ల వ్యయంతో జీ+ 5 అంతస్థులతో టిమ్స్ Hospital ని నిర్మించనున్నారు. Sanath Nagar లో 17 ఎకరాల్లో రూ. 882 కోట్లతో జీ+ 14 అంతస్తులతో టిమ్స్ భవనాన్ని నిర్మించనున్నారు. గతంలో Kothapetలో ఫ్రూట్ మార్కెట్ ఉన్న స్థలంలో రూ.900 కోట్లతో జీ+ 14 అంతస్థులతో టిమ్స్ ను నిర్మించనున్నారు ఒక్కో ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం నాడు అల్వాల్ లో ఈ మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. రూ. 2,679 కోట్లతో ఈ మూడు ఆసుపత్రులను నిర్మించనున్నారు.