దేశంలో వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగంలో వుందని పేర్కొన్నారు.

వలస పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మంగళవారం నాగర్ కర్నూలు కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగంలో వుందని పేర్కొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయని కేసీఆర్ తెలిపారు. అందరం కలిసి కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. 

అంతకుముందు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ ఉదయ్ కుమార్‌ను ఛాంబర్‌లో కూర్చొండబెట్టారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద పోలీసు బలగాల నుంచి కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. నాగర్ కర్నూలు మున్సిపాటిలీ పరిధిలోని దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్ చౌరస్తాలో 12 ఎకరాల స్థలంలో రెండు అంతస్తుల్లో కలెక్టరేట్‌ను నిర్మించారు. రూ. 52 కోట్లతో ఈ భవనాన్ని నెలకొల్పారు. మొత్తం 32 శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి.