గ్రేటర్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించకపోవడంమీద చర్చించినట్టు సమాచారం.

ఉదయం ఏడు గంటలకు జరిగిన ఈ భేటీలో ఎన్నికల ఫలితాలతో పాటు, మేయర్ ఎంపిక విషయంలో చర్చ జరిగింది. వైఫల్యానికి కారణాలేంటి.. టీఆర్ఎస్ అనుకున్న స్థానాల కన్నా తక్కువ చోట్ల గెలవడంపై ఇరువురు నేతలు.. గతం కన్నా తక్కువ స్థానాలు గెలవడంపై చర్చిస్తున్నట్టు సమాచారం.

అభ్యర్థుల విషయంలో తప్పులా, స్థానిక ఇంచార్జుల వైఫల్యమా, కో ఆర్డినేషన్ ఎక్కడ దెబ్బ తిన్నది అనే విషయాల్లో చర్చించినట్టు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలని అనే అంశాల మీద చర్చించినట్టు సమాచారం. 

కాగా డిసెంబర్ 1న జరిగిన బల్దియా ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకున్న సంగతి తెలిసిందే. 101 సీట్లు గెలుచుకుంటామని చెప్పిన టీఆర్ఎస్ 55 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.