రూ. 6,500గా ఉన్న వారి వేతనం రూ. 10,500 కు పెరుగుతంది.
సీఎం కేసీఆర్ వీఆర్ఏలపై వరాల జల్లు కురిపించారు. మహాశివరాత్రి పర్వదినాన వారికి తీపు కబురు అందించారు. వీఆర్‌ఏల వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
వీఆర్‌ఏల సంక్షేమంపై ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం వారి వేతనాన్ని 64.61 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయంతో ఇప్పటిరవకు రూ. 6,500గా ఉన్న వారి వేతనం రూ. 10,500 కు పెరుగుతంది. కాగా, తెలంగాణ సాధన ఇంక్రిమెంట్ పేరుతో మరో రూ. 200 అదనంగా అందించనున్నారు.
అంతేకాకుండా వారసత్వంగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సెలెక్టైన వీఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 19,345 మంది వీఆర్‌ఏలకు లబ్ధి చేకూరనుంది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.
