కాళేశ్వరం ఆలయంలో కేసీఆర్ పెట్టిన చీర చోరీ.. ఆలయ ఉద్యోగే దొంగ..?

First Published 21, Jul 2018, 5:25 PM IST
CM KCR donated saree missing in kaleshwaram temple
Highlights

భూపాలపల్లి జిల్లాలోని ప్రఖ్యాత కాళేశ్వర దేవస్థానంలో చోరీ జరిగింది.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర చోరికి గురైంది. 

భూపాలపల్లి జిల్లాలోని ప్రఖ్యాత కాళేశ్వర దేవస్థానంలో చోరీ జరిగింది.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మవారికి సమర్పించిన పట్టుచీర చోరికి గురైంది. ఆలయ ఉద్యోగే చీరను మాయం చేసినట్లు వార్తలు గుప్పుమనడంతో సదరు ఉద్యోగి అలాంటి చీరనే కొనుక్కొచ్చి మాయమైన చీర స్థానంలో ఉంచినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కులు చెల్లిస్తానని 2012లో కేసీఆర్ మొక్కుకున్నారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా ఆలయానికి చేరుకుని శుభానంద దేవికి బంగారు కిరీటాన్ని పట్టువస్త్రాలను బహుకరించారు. ఇప్పుడు ఆ చీరే మాయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమ్మవారి చీర మాయం కాలేదని.. భద్రంగా ఉందని ఆలయ, ఛైర్మన్, ఈవో చెబుతున్నారు.

loader